ఆరు గంటలుగా రేణిగుంట ఎయిర్‌పోర్టులో బాబు నిరసన

By narsimha lode  |  First Published Mar 1, 2021, 4:21 PM IST

ఆరు గంటలుగా చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్టులోని లాంజ్ లోనే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు బైఠాయించి నిరసనకు దిగారు.


తిరుపతి:ఆరు గంటలుగా చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్‌పోర్టులోని లాంజ్ లోనే టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు బైఠాయించి నిరసనకు దిగారు.

చిత్తూరు జిల్లాలో సోమవారం నాడు చంద్రబాబునాయుడు నిరసనకు దిగాలని ప్లాన్ చేసుకొన్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులోనే చంద్రబాబునాయుడిని పోలీసులు ఇవాళ అడ్డగించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్లను కలుస్తానని పోలీసులకు చెప్పారు. ఈ విషయమై పోలీసు అధికారులతో చంద్రబాబునాయుడు వాగ్వాదానికి దిగారు.

Latest Videos

undefined

తనను చిత్తూుు ఎస్పీ, కలెక్టర్లను కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ  లాంజ్ లోనే బైఠాయించారు. ఆరు గంటలుగా ఆయన అదే లాంజ్ లోనే బైఠాయించి నిరసనను కొనసాగిస్తున్నారు.చంద్రబాబునాయుడును రేణిగుంట నుండి హైద్రాబాద్ కు పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత చంద్రబాబునాయుడు  ఆహారం తీసుకొన్నట్టుగా సమాచారం.

చంద్రబాబునాయుడు నిరసన కార్యక్రమం గురించి తెలుసుకొన్న టీడీపీ కార్యకర్తలు ఎయిర్ పోర్టు వద్దకు భారీగా చేరుకొన్నారు.కార్యకర్తలను ఎయిర్ పోర్టు వద్దే పోలీసులు నిలువరించారు. ఎయిర్ పోర్టు వద్దే పోలీసులు భారీగా మోహరించారు. 
 

click me!