బుల్లెట్ మీద విజయ్ సాయిరెడ్డి.. హెల్మెట్ ఎక్కడ అంటూ....

By AN TeluguFirst Published Mar 1, 2021, 4:31 PM IST
Highlights

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి బుల్లెట్ నడిపారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. 

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి బుల్లెట్ నడిపారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. 

ఇక్కడి 40వ వారు అభ్యర్థి గుండపు నాగేశ్వరరావు, 63వ వార్డు అభ్యర్థి పిలకా రామ్మోహన్ రెడ్డిల తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బైక్ ర్యాలీలో విజయ్ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఒక బైక్ మీద రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్, మరో బైక్ పై  విజయ్ సాయి రెడ్డి ఉన్నారు. రాష్ట్ర మంత్రులై ఉండి బైక్ లు నడుపుతూ హెల్మెట్ పెట్టుకోకపోవడం విశఏషం. 

హెల్మెట్ తో పాటు మాస్కులు కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు దీనిమీద ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాస్క్ పెట్టుకోకుండా కోవిడ్ నిబంధనలను గాలికొదిలేశారని విమర్శిస్తున్నారు. బాధ్యతగల పదవుల్లో ఉండి... హెల్మెట్ లేకుండా బైక్ లు నడుపుతూ, కోవిడ్ నిబంధనలు అతిక్రమించడంతో ఇద్దరు నేతలూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

ఏపీలో ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఒక పక్క ప్రభుత్వం భారీ జరిమానాలు విధిస్తుంటే.. మరోవైపు ప్రభుత్వాన్ని పాలించే మంత్రులే వారి నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. 

ఏపీలో హెల్మెట్ లేని ప్రయాణానికి రూ. 1000 జరిమానా ఉన్న విసయాన్ని గుర్తు చేస్తున్నారు. యథారాజా తథాప్రజా అన్నట్టు వెనక ఉన్నవారు కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫొటోలు స్వయంగా విజయ్ సాయి రెడ్డే తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఇంకా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

click me!