అసలైన రామరాజ్యాన్ని అందించడమే మా లక్ష్యం: చంద్రబాబు నాయుడు

By Arun Kumar PFirst Published Mar 29, 2021, 10:56 AM IST
Highlights

కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ వంటి దేశభక్తుల స్ఫూర్తిగా మహాశయుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు!'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇప్పుడు అసలైన రామరాజ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంతో ముందుకు  వెళుతోందన్నారు. 

''కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ వంటి దేశభక్తుల స్ఫూర్తిగా మహాశయుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు!'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 
 
''తెలుగువారందరూ ఆత్మగౌరవంతో, సమసమాజానికి బాటలువేస్తూ, తెలుగునేల ఘనతను ప్రపంచ నలుదిక్కులా చాటేలా... అభివృద్ధిపథంలో దూసుకుపోవాలన్న ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు, ప్రజలకు అసలైన రామరాజ్యాన్ని అందించే వరకు విశ్రమించరాదని ఈ వ్యవస్థాపక దినం సందర్భంగా మనందరం ప్రతిజ్ఞ తీసుకుందాం'' అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుజాతికి 40 ఏళ్ల అండ ..తెలుగుదేశం జెండా.. తెలుగుదేశం బ‌లం, బ‌ల‌గం వెన్నుచూప‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులే!పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తోన్న టిడిపి కుటుంబ‌స‌భ్యులంద‌రి సంక్షేమానికి కృషి చేస్తాం. తెలుగువారి కోసం తెలుగువెలుగు ఎన్టీఆర్ గారు మహోన్నత ఆశయాలతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు!'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

''క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న ప్ర‌తీ ఒక్క‌రి శ్ర‌మ‌నీ గుర్తించి మ‌రీ గౌర‌విస్తాం. కార్య‌క‌ర్త‌ల సంక్షేమానికి ప్ర‌త్యేకంగా ఓ విభాగం న‌డుపుతున్న దేశంలోని ఏకైక రాజ‌కీయ‌పార్టీ తెలుగుదేశ‌మే. టిడిపి 40వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తీ ఒక్క‌రికీ నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు'' అని అన్నారు.

''పేదలకు ఆత్మగౌరవంతో కూడిన సంక్షేమాన్నిచ్చిన పార్టీ, బడుగులకు ఎదిగే స్వేచ్ఛనిచ్చిన పార్టీ, మహిళలకు సాధికారతను ఇచ్చిన పార్టీ.. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం జెండా ఎక్కడ ఎగిరితే అక్కడ శుభము, శాంతి కొలువుంటాయి'' అని లోకేష్ పేర్కొన్నారు. 

click me!