మదనపల్లి జంట హత్యలు : విశాఖ మెంటల్ ఆస్పత్రి నుంచి నిందితుల డిశ్చార్జ్..

Published : Mar 29, 2021, 10:12 AM IST
మదనపల్లి జంట హత్యలు : విశాఖ మెంటల్ ఆస్పత్రి నుంచి నిందితుల డిశ్చార్జ్..

సారాంశం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి జంట హత్యల కేసులో నిందితులు సోమవారం విశాఖ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నారు. వారిని చిత్తూరుకు తీసుకువెల్లేందుకు మదనపల్లి పోలీసులు విశాఖ చేరుకున్నారు. 

ఒక ఎస్.ఐ. ఐదుగురు పోలీసులు ఎస్కార్ట్ వెహికిల్ లో అక్కడికి చేరుకున్నారు. ఈ ఏడాది జనవరి 24న మదనపల్లికి చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఇద్దరు కూతుళ్లు ఆలేఖ్య, సాయి దివ్య లను అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. 

ఫిబ్రవరి 4న వీరి మానసిక ప్రవర్తనమీద చికిత్స కోసం వారిద్దరినీ విశాఖ మానసిక హాస్పిటల్‌కు తరలించారు. విశాఖ మానసిక హాస్పిటల్ వైద్యులు, ఇరువురికీ మెరుగైన వైద్యం అందించారు. 

మానసిక పరిస్థితి మెరుగుపడడంతో పురుషోత్తం నాయుడు, పద్మజ పశ్చాత్తాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ పోలీసులు రోడ్డు మార్గంలో మదనపల్లె సబ్ జైలుకు తరలించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం