70 ఏళ్ల బండి లోకేశ్ స్పీడ్ బ్రేకర్‌ను దాటలేదు: బాబుపై వంశీ తీవ్రవ్యాఖ్యలు

By sivanagaprasad KodatiFirst Published Nov 15, 2019, 6:48 PM IST
Highlights

తనకు లోకేశ్ అంటే తెలియదని కేవలం పప్పు అంటేనే తెలుసునన్నారు టీడీపీ బహిష్కృత నేత వల్లభనేని వంశీ. శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, నారా లోకేశ్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు

తనకు లోకేశ్ అంటే తెలియదని కేవలం పప్పు అంటేనే తెలుసునన్నారు టీడీపీ బహిష్కృత నేత వల్లభనేని వంశీ. శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, నారా లోకేశ్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీకి నారా లోకేశ్ ఒక గుదిబండ అని... 70 ఏళ్ల బండి ఆ స్పీడ్ బ్రేకర్‌ను దాటలేదని వంశీ సెటైర్లు వేశారు.

ప్రెస్‌మీట్‌లో తాను అడిగింది ఒకటైతే.. టీడీపీ బ్యాచ్ చెప్పేది మరోకొటి అంటూ చురకలు అంటించారు. 1978లో ఇందిరా గాంధీ చంద్రబాబుకు ఏం చూసి టికెట్ ఇచ్చారని వంశీ ప్రశ్నించారు. పార్టీ ఆదేశిస్తే ఎన్టీఆర్ మీదైనా పోటీచేస్తానని.. రంగులేసుకునేవారికి రాజకీయాలు ఎందుకని బాబు అనలేదా అంటూ వంశీ ఫైరయ్యారు.

ఎన్నికల్లో టీడీపీ అఖండ మెజారిటీతో గెలిచిన వెంటనే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలిపెట్టారని వంశీ ప్రశ్నించారు. తాను చేసింది ఎదవ పనైతే.. చంద్రబాబు చేసింది ఎదవన్నర పనా 30 ఏళ్ల కిందట బాబు చేసిన ఈ పనిని ప్రెస్‌మీట్లు పెట్టే బ్యాచ్ ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Also Read:ఓ పప్పు, చుట్టూ బఫూన్లు: లోకేష్‌పై వంశీ తిట్ల వర్షం

అత్యంత అవినీతి చక్రవర్తి, దోపిడి దొంగ, ఔరంగజేబు, వెన్నుపోటుదారుడు, నీచుడు, నికృష్టుడు, భూమ్మీద ఉండటానికి కూడా పనికిరావంటూ ఎన్టీఆర్ మరణించేముందు వ్యాఖ్యానించారని వంశీ గుర్తుచేశారు.

మోడీని నరకహంతకుడని, ఈ రాష్ట్రంలోకి రానివ్వనని, అరెస్ట్ చేయిస్తానని 2004లో నిప్పులు తొక్కిన చంద్రబాబు.. 2014లో మోడీతో కలిసి తిరిగారని వంశీ మండిపడ్డారు. నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో కలిపేసుకున్నప్పుడు నరేంద్రమోడీ ఇంటి ముందు చంద్రబాబు దీక్ష ఎందుకు చేయరని వల్లభనేని ప్రశ్నించారు.

తనపై పిచ్చికుక్కలను వదలకుండా బోనులో పెట్టుకోవాలని చంద్రబాబును వంశీ హెచ్చరించారు. తాజా ఎన్నికల్లో తనతో పాటు చాలామందికి టికెట్లు ఇచ్చారని.. వాళ్లంతా గెలిచారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్, మోడీపై చంద్రబాబు మాట్లాడిన వీడియోలు తన వద్ద కూడా వున్నాయని వంశీ హెచ్చరించారు.

చంద్రబాబు తన రెండకరాల్లో సేద్యం చేసి ఆ డబ్బుతో తామందరికి పార్టీ ఫండ్ ఇచ్చాడా అని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా వాళ్లిచ్చేది పల్లీకి, పాప్‌ కార్న్‌కి సరిపోదని సెటైర్లు వేశారు.

రాజకీయాల నుంచి తప్పుకోవాలని ముందు అనుకున్నానని కానీ అనుచరులు, కార్యకర్తలతో పాటు గన్నవరం నియోజకవర్గ ప్రజల కోసం మనసు మార్చుకున్నానని వంశీ స్పష్టం చేశారు.

Also read:వంశీ తిట్లు: చంద్రబాబుకు ఎదురు తిరిగిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

చంద్రబాబు, నారా లోకేశ్‌తో తిరిగితే ఎవరికైనా ఫస్ట్రేషన్ వస్తుందని ఆయన మండిపడ్డారు. సుజనా చౌదరి ఎప్పుడూ తనను బీజేపీలోకి ఆహ్వానించలేదని.. ఆయనతో సన్నిహిత సంబంధాలు వున్న మాట వాస్తవమేనని వల్లభనేని అంగీకరించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి తెలంగాణలో పార్టీని ముంచేశారని, ఇప్పుడు ఏపీలోనూ అలాగే చేయబోతున్నారని వంశీ జోస్యం చెప్పారు.

click me!