తూర్పులో చంద్రబాబుకు షాక్: గుడ్ బై చెప్పిన మాజీఎమ్మెల్యే

By Nagaraju penumalaFirst Published Jul 8, 2019, 6:19 PM IST
Highlights

వైయస్ జగన్ పార్టీ కండువా కప్పుకుంటుండగా ఎమ్మెల్సీ ఇస్తానంటే పార్టీ కండువా వేసుకుంటానని హామీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో జగన్ అందుకు ససేమిరా అన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు అయిష్టత చూపడంతో వైసీపీలో చేరికకు గండిపడింది. ఆ తర్వాత రావులపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మళ్లీ టీడీపీ కండువాకప్పుకున్నారు. 

హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస దెబ్బలతో కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మరో ఎమ్మెల్యే. 

పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి తెలుగుదేశం పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసిన ఆయన బీజేపీలో చేరే అంశంపై చర్చించారు. 

బీజేపీలో చేరేందుకు అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో బీజేపీ గూటికి చేరబోతున్నారు పులపర్తి నారాయణ మూర్తి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఆశించి భంగపడ్డారు పులపర్తి నారాయణ మూర్తి. 

సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పులపర్తి నారాయణ మూర్తిని కాదని నేలపూడి స్టాలిన్ బాబుకు టికెట్ కేటాయించింది టీడీపీ నాయకత్వం. దీంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 

వైయస్ జగన్ పార్టీ కండువా కప్పుకుంటుండగా ఎమ్మెల్సీ ఇస్తానంటే పార్టీ కండువా వేసుకుంటానని హామీ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో జగన్ అందుకు ససేమిరా అన్నారు. పార్టీలో చేర్చుకునేందుకు అయిష్టత చూపడంతో వైసీపీలో చేరికకు గండిపడింది. ఆ తర్వాత రావులపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో మళ్లీ టీడీపీ కండువాకప్పుకున్నారు. 

అయితే గత ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం, పి.గన్నవరం నియోజకవర్గంలో కూడా టీడీపీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంచి ముహూర్తాన కాషాయి గూటికి చేరనున్నారు పులపర్తి నారాయణ మూర్తి.  

click me!