చంద్రబాబుకు షాక్: కేంద్రమంత్రితో వల్లభనేని వంశీ మంతనాలు, త్వరలో బీజేపీ గూటికి..?

By Nagaraju penumalaFirst Published Jul 8, 2019, 5:58 PM IST
Highlights

ఇలాంటి తరుణంలో కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీమోహన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వల్లభనేని వంశీమోహన్ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డిని కలిశారంటూ వార్తలు వస్తున్నాయి.  అయితే కిషన్ రెడ్డితో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భేటీపై అటు బీజేపీ గానీ ఇటు వంశీగానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

విజయవాడ: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టడంతో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఎవరిని ఎత్తుకుపోతుందోనని అన్ని రాజకీయ పార్టీలు నిఘావేసుకుని ఉన్నాయి. 

బీజేపీ నేతలు తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెడితే చాలు బీజేపీలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. దీంతో ఎవరు ఎప్పుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. 

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్రం హోశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు. గంటకు పైగా కిషన్ రెడ్డితో మంతనాలు జరిపారు వల్లభనేని వంశీమోహన్. కిషన్ రెడ్డితో వంశీమోహన్ భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఊడ్చేసే పనిలో పడింది బీజేపీ. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకుని రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ సంగతి మరువకముందే మరోక తిరుగుబాటు ఎదురైంది. 

తెలుగుదేశం పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గం నేతల భేటీలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. వరుసగా భేటీలు కావడం, చంద్రబాబు దగ్గర అల్టిమేటం జారీ చేయడం వంటి పరిణామాలు రాజకీయపరంగా ఆసక్తి రేపుతున్నాయి. 

ఇలాంటి తరుణంలో కిషన్ రెడ్డితో వల్లభనేని వంశీమోహన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వల్లభనేని వంశీమోహన్ బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే కిషన్ రెడ్డిని కలిశారంటూ వార్తలు వస్తున్నాయి.  

అయితే కిషన్ రెడ్డితో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భేటీపై అటు బీజేపీ గానీ ఇటు వంశీగానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే గత కొద్దిరోజులుగా వల్లభనేని వంశీమోహన్ బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. 

బీజేపీకి చెందిన జాతీయ నేతలు వంశీమోహన్ తో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరిగింది. పార్టీ మార్పుపై వంశీతో చర్చించారంటూ ప్రచారం జరిగింది. అయితే తాను టీడీపీని వీడేది లేదని అవన్నీ గాసిప్స్ అంటూ కొట్టిపారేశారు వంశీమోహన్. 

click me!