ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు షాక్ : వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల..?

By Nagaraju penumalaFirst Published Sep 25, 2019, 11:56 AM IST
Highlights

స్వరూపనందేంద్ర సరస్వతితో పంచకర్ల రమేష్ బాబు భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పంచకర్ల రమేష్ బాబు త్వరలోనే వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. 

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్తారంటూ ప్రచారం జరుగుతోంది. 

గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో రగిలిపోతున్నారు పంచకర్ల రమేష్ బాబు. ఇకపోతే ఇటీవల కాపు సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేల సమావేశంలో పంచకర్ల రమేష్ బాబు కూడా పాల్గొన్నారు. 

ఆనాటి నుంచి పంచకర్ల రమేష్ బాబు పార్టీ వీడతారంటూ ప్రచారం జరిగింది. అయితే ఊహించని రీతిలో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిని బుధవారం ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంటకు పైగా స్వామి స్వరూపానందేంద్ర స్వామితో చర్చించారు. 

స్వరూపనందేంద్ర సరస్వతితో పంచకర్ల రమేష్ బాబు భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పంచకర్ల రమేష్ బాబు త్వరలోనే వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. స్వరూపనందేంద్ర సరస్వతికి సీఎం వైయస్ జగన్ నమ్మకస్తుడు కావడంతో పార్టీలో చేరితే ఎలా ఉంటుందనే అంశంపై ఇద్దరూ చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. 

అందులో భాగంగానే స్వరూపనందేంద్ర సరస్వతితో భేటీ అయినట్లు ప్రచారం. అయితే స్వరూపనందేంద్ర సరస్వతిని కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. అయితే తెలుగుదేశం పార్టీ వీడే అంశంపై గానీ వైసీపీలో చేరే అంశంపై గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పంచకర్ల రమేష్ బాబు. 

బాబుకు గట్టి షాక్: పార్టీ వీడనున్న ముగ్గురు సీనియర్లు

బాబుకి షాక్: వైసీపీలోకి అడారి ఆనంద్, విశాఖ డైరీ ఇక ఫ్యాన్ గుప్పిట్లోకి

తూర్పులో బాబుకు షాక్: టీడీపీకి వరుపుల రాజా గుడ్‌బై

click me!