ఏపీలో మూడు రాజధానులు: లాయర్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న టీడీపీ నేత

By sivanagaprasad KodatiFirst Published Dec 23, 2019, 4:59 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టాలన్న జీఎన్ రావు కమిటీ నివేదిక నేపథ్యంలో అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ప్రాంతాల్లో పెట్టాలన్న జీఎన్ రావు కమిటీ నివేదిక నేపథ్యంలో అనంతపురం జిల్లా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.

సోమవారం అనంతలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్నూలులో హైకోర్టు, విజయవాడ, విశాఖలో హైకోర్టు బెంచ్‌ల్లో లాయర్లు పనిచేయాలంటే ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు.

కర్నూలులో హైకోర్టు కాకుండా రాజధానిని నిర్మించాలని పార్థసారథి డిమాండ్ చేశారు. కాగా ఆయన వ్యాఖ్యలపై న్యాయవాదులు భగ్గుమన్నారు. పార్థసారథి వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని, వెంటనే తమకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Also Read:వైఎస్ జగన్ కు మద్దతు: చిరంజీవిపై సోమిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్థించడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత, తమ్ముడు పవన్ కల్యాణ్ జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండగా చిరంజీవి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటం చేస్తుంటే భుజం తట్టకుండా మరో రాగమెత్తుకున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిరంజీవిపై ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన చిరంజీవిపై వ్యాఖ్యలు చేశారు. 

Also Read:ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఎంక్వైరీ వేసుకుని.. చర్యలు తీసుకోవచ్చు: జగన్‌కు బాబు సవాల్

అప్పుడు ప్రజారాజ్యం పెట్టి దాన్ని రో పార్టీలో కలిపారని, మంత్రి పదవి పొంది విభజన పాపంలో పాలు పంచుకున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు తమ్ముడు ప్రజల కోసం పోరాటం చేస్తుంటే భుజం తట్టకుండా మరో రాగం ఎత్తుకున్నారని ఆయన అన్నారు. 

తెలంగాణలో వ్యాపారాలు, సినిమాలు చేసుకునే పెద్దన్నకు ఏపీ జనం కష్టాలు ఏం తెలుస్తాయని, మళ్లీ దూకేస్తారేమోనని ఆయన చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.  

click me!