నంద్యాలలో కొనసాగుతున్న ‘దేశం’ అరాచకాలు

First Published Aug 23, 2017, 1:58 PM IST
Highlights
  • ఉదయం నుండే పలువురు మహిళలు, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి కనబడ్డారు.
  • కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఉదయం 10 గంటలకల్లా 50 శాతం పోలింగ్ దాటిపోయింది.
  • ఓ అంచనా ప్రకారం ఓటింగ్ సరళి ఇదే విధంగా కొనసాగితే సాయంత్రానికి పోలింగ్ 80 శాతం దాటుతుంది.
  • ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది కాబట్టే జనాలు స్వచ్చంధంగా పెద్ద ఎత్తున ఓటింగ్ కు హాజరవుతున్నట్లు ఓ విశ్లేషణ.

నిబంధనలన్నింటినీ కాలరాస్తూ టిడిపి నేతలు నంద్యాల ఉపఎన్నికలో అరచాకాలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం నంద్యాల ఔట్ సైడర్స్ ఎవరూ 21 సాయంత్రం నుండే జిల్లాలో ఉండేందుకు లేదు. కానీ పలువురు మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు నంద్యాలలోను, సరిహద్దు గ్రామాల్లోనే తిష్టవేసారు. సామాజికవర్గాల వారీగా ప్రముఖులను ప్రలోభాలుపెట్టటం, వైసీపీ నేతల ఇళ్ళపై దాడులు చేయమని పోలీసులను పురమాయిస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రి కూడా పోలీసులు ఏకంగా వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి ఇంటిపైనే దాడులు చేయటం కలకలం రేపింది.

అభ్యర్ధి ఇంటిపైనే పోలీసులతో దాడులు చేయించారంటేనే టిడిపి నేతలు ఎంతకి తెగించారో అర్ధమైపోతోంది. ఇక, బుధవారం పోలింగ్ మొదలైనప్పటి నుండి అనేక కేంద్రాల్లో యధేచ్చగా తిరుగుతున్నారు. టిడిపి అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి సోదరి, మంత్రి అఖిలప్రియకు సోదరైన భూమా మౌనిక తనిష్టమొచ్చినట్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లతో మాట్లాడటమే కాకుండా వైసీపీ ఏజెంట్లను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు.

వెబ్ కెమెరాల్లో ఆ విషయాలన్నీ రికార్డయినా చర్యలు మాత్రం లేవు. అదేవిధంగా టిడిపికి చెందిన పలువురు ఎంఎల్ఏలు పోలింగ్ బూత్ ల వద్ద కనబడతున్నారు. మరికొందరు నేతలు ఇప్పటికీ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు నిబంధనల ప్రకారం ఏవేవి చేయకూడదో టిడిపి అవన్నీ చేస్తోంది. చూడబోతే నిబంధనలున్నవి ఉల్లంఘించటానికే అన్నట్లుంది టిడిపి నేతల వ్యవహారం.

ఈ మొత్తానికి కారణమేంటంటే  భారీ పోలింగ్ నమోదవుతుందన్నఅ నుమానాలే. ఎందుకంటే, పోలింగ్ గనుక భారీగా నమోదైతే టిడిపికి నష్టమట. అందుకనే ఓటింగ్ ను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. విచిత్రమేంటంటే ఓటింగ్ కు రాకుండా ఉంటే టిడిపి డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం.

ఉదయం నుండే పలువురు మహిళలు, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరి కనబడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఉదయం 10 గంటలకల్లా 50 శాతం పోలింగ్ దాటిపోయింది. ఓ అంచనా ప్రకారం ఓటింగ్ సరళి ఇదే విధంగా కొనసాగితే సాయంత్రానికి పోలింగ్ 80 శాతం దాటుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది కాబట్టే జనాలు స్వచ్చంధంగా పెద్ద ఎత్తున ఓటింగ్ కు హాజరవుతున్నట్లు ఓ విశ్లేషణ. అది గ్రహించే టిడిపి నేతలు అరాచకాలకు దిగుతున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది.

click me!