
టీడీపీ నేతలు నంద్యాల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపి నేత వాసిరెడ్డి పద్మ. ఓక పక్క పోలింగ్ జరుగుతుంటే మరో పక్క టీడీపీ నాయకులు తమ పార్టికి ఓటు వెయ్యాలని ప్రజలను ప్రలోబపెడుతున్నారని మండిపడ్డారు, బుధవారం మీడియా మాట్లాడిన వాసిరెడ్డి పద్మ టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతోన్నాయని ఆరోపణలు చేశారు.
చంద్రబాబు సెక్రటేరియట్ నుండి నంద్యాల్లో ఉన్న నేతలకు సూచలు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు ఓక వీధీ గుండాలాగా దిగజారుడు పనులు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి విలువలను కాలరాస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలో గెలమని భావించే టీడీపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ప్రజలకు డబ్బుతో ప్రలోబాలు పెడుతున్నారని అన్నారు. టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు.
తమ పార్టికి నోటీసులు వచ్చాయన్నది పచ్చి అబద్దం అని పద్మ తెలిపారు. జగన్ పై ఎన్నికలు జరుగుతున్న సమయంలో అబద్దపు ప్రచారం తగదని ఆమె సూచించారు. తాము జగన్ పై టీడీపీ నేతలు చేసి అబద్దపు ప్రచారంపై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామని వాసిరెడ్డి పద్మ తెలిపారు.
అయితే వాస్తవం ఎమీటొ పద్మకి కూడా తెలుసు చంద్రబాబు పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల కమీషన్... బన్వర్ లాల్ కు జగన్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేయ్యాలని ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తాజా విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి