జీవోలు ఆన్‌లైన్‌లోనే ఉంచాలి, లేదంటే కోర్టుకు: ఏపీ గవర్నర్‌కి టీడీపీ ఫిర్యాదు

By narsimha lode  |  First Published Aug 20, 2021, 7:30 PM IST

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను ఆన్‌లైన్ లో అప్ లోడ్ చేయకుండా నిలిపివేయడంపై టీడీపీ నేతలు  శుక్రవారం నాడు గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ కు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ లో జీవోలను వెంటనే అప్ లోడ్ చేయాలని కోరారు.  వారం రోజుల్లో ఈ ప్రక్రియను  వెనక్కి తీసుకోకపోతే  కోర్టును ఆశ్రయిస్తామని ఆయన ప్రకటించారు.


అమరావతి:జీవోలను ప్రభుత్వ డొమైన్‌లో అప్‌లోడ్  చేయకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయంపై ఏపీ గవర్నర్  బిశ్వభూషన్ హరిచందన్ కు టీడీపీ శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది.టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్యల నేతృత్వంలోని బృందం ఇవాళ  ఏపీ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది.

 ఈ సందర్భంగా  టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.  అర్ధరాత్రి పూట రహస్య జీవోలను విడుదల చేస్తున్నారని  టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వారం రోజుల్లో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

Latest Videos

లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం బ్లాంక్ జీవోలు జారీ చేయడానికి కుదరదని ఆయన చెప్పారు.బ్లాంక్ జీవోలపై ఫిర్యాదు చేయగానే ఆన్‌లైన్ లో జీవోలు జారీ చేసే ప్రక్రియనే నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు. బ్లాంక్ జీవోలపై వారం రోజుల క్రితం టీడీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాుద చేశారు. ఆ తర్వాత జీవోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయ వద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

click me!