మాజీ మంత్రి దేవినేనితో సినీ నటుడు నారా రోహిత్ భేటీ

Published : Aug 20, 2021, 06:52 PM IST
మాజీ మంత్రి దేవినేనితో సినీ నటుడు  నారా రోహిత్ భేటీ

సారాంశం

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో  ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్, నిర్మాత అట్లూరి నారాయణరావు తాడికొండ సాయికృష్ణ భేటీ అయ్యారు. ప్రజల కోసం నిత్యం పనిచేసే నేతకు ప్రజల అండదండలుంటాయని నారా రోహిత్ అభిప్రాయపడ్డారు.

 
విజయవాడ: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు తో ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ , నిర్మాత అట్లూరి నారాయణ రావు తాడికొండ సాయి కృష్ణ భేటి అయ్యారు. గొల్లపూడి లోని ఉమామహేశ్వరరావు నివాసంలో శుక్రవారం నాడు  ఆయనను కలిశారు.  ఈ సందర్భంగా నారా రోహిత్  మీడియాతో మాట్లాడారు.

 ప్రజల సమస్యలు పరిష్కారం కోసం  దేవినేని ఉమామహేశ్వరరావు నిత్యం పనిచేస్తుంటారని నారా రోహిత్ చెప్పారు. ప్రజల కోసం పనిచేసే వారికి ప్రజలు ఎప్పుడూ కూడ మద్దతిస్తారని ఆయన చెప్పారు. 

కృష్ణా జిల్లాలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించి వస్తున్న తనపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని  దేవినేని ఉమా మహేశ్వరరావు ఆందోళన చేశారు. ఈ విషయమై ఆందోళన చేస్తున్న దేవినేని ఉమా మహేశ్వరరావును ఈ ఏడాది జూలై 28న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన బెయిల్ పై విడుదలై ఇటీవలనే ఆయన జైలు నుండి విడుదయ్యారు.

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?