పిరికివాడా... నువ్వొక నాయకుడివి, నీదొక పార్టీ..: జగన్ పై లోకేష్ ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Feb 28, 2021, 01:00 PM ISTUpdated : Feb 28, 2021, 01:20 PM IST
పిరికివాడా... నువ్వొక నాయకుడివి, నీదొక పార్టీ..: జగన్ పై లోకేష్ ఫైర్

సారాంశం

అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య పంచాయితీ ఎన్నికల్లోమొదలైన మాటల యుద్దం మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగుతోంది. 

మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు ముగిసి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఈ క్రమంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య పంచాయితీ ఎన్నికల్లోమొదలైన మాటల యుద్దం మున్సిపల్ ఎన్నికల్లో కొనసాగుతోంది. తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

''వైసీపీ తరుపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  అభ్యర్థులు లేక టిడిపి అభ్యర్థులని బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి బులుగు కండువాలు కప్పారు. పలాస, రాయదుర్గంతో పాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కుమాలిన పార్టీ అధినేత జగన్ కు తాడేపల్లి కొంప గేటు దాటి వస్తే జనం తంతారని భయం. వైసీపీ అభ్యర్ధులకు జనంలోకి వెళ్లి ఓటు అడగాలంటే భయం. పంచాయతీ ఎన్నికలు పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే టిడిపి అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారు. నువ్వొక నాయకుడివి. నీదొక పార్టీ. అందుకే నిన్ను పిరికివాడు అనేది జగన్ రెడ్డి'' అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 

read more   జగన్ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్చవం... ఎస్ఈసికి ఏమయ్యింది?: చంద్రబాబు ఆగ్రహం

''పల్లెలు గెలిచాయి ఇప్పుడిక మనవంతు. పట్టణాల అభివృద్ధి కోసం 10 వాగ్దానాలతో మ్యానిఫెస్టో విడుదల చేసాం. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను. పురపాలక ఎన్నికల్లో గెలిస్తే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం'' అంటూ లోకేష్ మరో ట్వీట్ చేశారు. 
 

 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu
CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu