టీడీపీ చీఫ్ చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. తన ఆరోగ్యంతో పాటు భద్రతకు సంబంధించి ఏసీబీ కోర్టుకు చంద్రబాబు లేఖ రాశారు.
అమరావతి:టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. మూడు పేజీల లేఖను చంద్రబాబు ఏసీబీ కోర్టు జడ్జికి రాశారు. రాజమండ్రి జైలు అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ పంపారు. ఈ నెల 25వ తేదీన చంద్రబాబు నాయుడు ఈ లేఖ రాశారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న విషయాన్ని చంద్రబాబు ఆ లేఖలో గుర్తు చేశారు.
తాను జైల్లోకి వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీశారని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు వీడియో పుటేజీని రిలీజ్ చేశారన్నారు.తనను అంతమొందించే కుట్ర జరుగుతుందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. తనను అంతమొందిస్తామని ఓ లేఖ కూడ వచ్చిన విషయాన్ని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ లేఖపై పోలీసు అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదని చంద్రబాబు ఆరోపించారు.
undefined
జైలులో ఇటీవల కొన్ని ఘటనలు తన భద్రతపై అనుమానాలకు తావిస్తుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.తన భద్రతపై తూర్పుగోదావరి ఎస్పీకి లేఖ వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.వామపక్ష తీవ్రవాదులు తనను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.తనను హత్య చేసేందుకు కోట్లు చేతులు మారినట్టుగా తన దృష్టికి వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ముగియడంతో ఈ నెల 19న చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపర్చారు. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ సమయంలో తన భద్రతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆరోగ్యం కూడ సరిగా లేదని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.
also read:చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్: విచారణ నుండి తప్పుకున్న జడ్జి
భద్రతకు సంబంధించిన అంశాలపై తనకు లేఖ రాయాలని జడ్జి సూచించారు. జడ్జి సూచన మేరకు చంద్రబాబు ఓ లేఖను రాశారు.ఈ లేఖ ఏసీబీ కోర్టు జడ్జికి పంపారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.ఈ పిటిషన్ పై తీర్పును ఈ ఏడాది నవంబర్ 8వ తేదీన వెల్లడించే అవకాశం ఉంది.