ప్రతీకారంతో రగిలిపోతూనే ఏసీబి కేసులు...: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Sep 15, 2020, 10:42 PM IST
Highlights

వైసిపి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు ఇచ్చిన ప్రాధాన్యత రైతు సంక్షేమానికి ఇవ్వడం లేదని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

గుంటూరు: వైసిపి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు ఇచ్చిన ప్రాధాన్యత రైతు సంక్షేమానికి ఇవ్వడం లేదని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సంగం మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

''ప్రతీకారాలతో రగిలిపోతూ ఏసీబీ కేసులు వేసే తీరిక ఉంది కానీ...  రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే తీరిక ప్రభుత్వానికి లేదా? నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సంగం మండల కేంద్రంలో ధాన్యం పండించిన రైతులు రోడ్డెందుకు ఎక్కాల్సివచ్చింది?'' అని చంద్రబాబు వైసిపి ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికన ప్రశ్నించారు. 

read more  అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్: దమ్మాలపాటి కేసులో హైకోర్టు స్టే

''రైతులు పండించే ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని ప్రకటనలు ఇస్తారు. మీ మాట నమ్మి నెల రోజులుగా ధాన్యం పొలాల దగ్గర పెట్టుకొని రైతులు ఎదురు చూస్తున్నారు. రోజులు గడిచేకొద్దీ ధాన్యం నాణ్యత కోల్పోతే అప్పుడు మీరే వంకలు పెట్టి గిట్టుబాటు ధరకు ఎసరు పెడతారు'' అంటూ మండిపడ్డారు.  

''ఏమిటిదంతా? రైతు బతకొద్దా? ఈ ప్రభుత్వం చేసే ఇలాంటి పనుల వల్లే రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఇప్పటికైనా రైతుల నుంచి ధాన్యం తక్షణమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. అలాగే చెల్లింపులు కూడా వెంటనే జరపాలి'' అని చంద్రబాబును జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు. 

click me!