టీడీపీని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టబోనని చంద్రబాబు ప్రకటించారు. రెండేళ్ల తర్వాత మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించి వారికి బుద్ది చెబుతానని చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూస్తానన్నారు.
కుప్పం: టీడీపీని ఇబ్బంది పెట్టే వాళ్లని వదిలి పెట్టబోనని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు చెప్పారు. శుక్రవారం నాడు Kuppam అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.
మరో రెండేళ్ల తర్వాత రాస్ట్రానికి మరోసారి సీఎం అవుతానని Chandrababu ధీమా వ్యక్తం చేశారు. సీఎం కాగానే Tdpని ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతానని తేల్చి చెప్పారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందుల పెట్టిన వారిని వదిలి పెట్టనని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి వారిని శిక్షిస్తామన్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాల్సిందేనన్నారు. ఏ వ్యక్తి చేసినా తప్పు తప్పేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని శిక్షపడేలా చేయడంలో తప్పు లేదన్నారు.
రాష్ట్రంలో ycp అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పార్టీకి చెందిన నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నేతలపై కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని చంద్రబాబు గతంలో పలుమార్లు మీడియా వేదికగానే ప్రకటించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టీడీపీకి చెందిన కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు నేతలు జైలుకు కూడా వెళ్లారు. టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు రెండు దఫాలు అరెస్టయ్యాడు. మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావులు కూడా అరెస్టయ్యారు. మరో వైపు మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కూడా పలుమార్లు పలు కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ కేంద్ర మంత్రి ఆశోక్ గజపతిరాజులపై కూడా కేసులు నమోదయ్యాయి. కొందరు నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొన్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా వైసీపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు పలు మార్లు విమర్శించారు. డీజీపీ గౌతం సవాంగ్ తీరును కూడా ఆయన తప్పుబట్టారు.
వైసీపీ కార్యకర్తల మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కూడా చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతేలపై దాడులు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన సమయాల్లో చోటు చేసుకొన్న తర్వాత కూడా తమ పార్టీ నేతలపైనే కేసులు పెట్టారని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టిన వారిపై విచారణ నిర్వహించి శిక్షించాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే తప్పుడు కేసులపై కూడా కోర్టులను ఆశ్రయిస్తున్నారు టీడీపీ నేతలు.తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకొంటామని చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే తమపై తప్పుడు కేసులు బనాయించిన పోలీస్ అధికారుల లెక్కలు తీస్తున్నామని కూడా చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు పదే పదే ప్రకటిస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్న పోలీసులైనా కూడా తాము వదిలిపెట్టబోనని చంద్రబాబు ప్రకటించారు.
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతల దాడులు, కేసులు బనాయించిన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు.