టీడీపీ చీప్ చంద్రబాబు నాయుడు పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. వన్ సైడ్ వద్దని జనసేనతో పొత్తుపై చంద్రబాబు వ్యాఖ్యలను గురించి సోము వీర్రాజు మాట్లాడారు.
అమరావతి: అవసరమైనప్పుడు లవ్ చేయడంలో చంద్రబాబు సమర్ధుడని bjpఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సెటైర్లు వేశారు.శుక్రవారం నాడు Somu Veerraju అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కుప్పంలో జరిగిన సభలో జనసేనతో పొత్తు గురించి Tdp కార్యకర్త మాట్లాడిన సమయంలో వన్ సైడ్ గురించి వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై వన్ సైడ్ ఉండొద్దని.. రెండు వైపులా పొత్తులపై ఆసక్తి ఉండాలని chandrababu చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారన్నారు.గతంలో కాంగ్రెస్ ను కూడా చంద్రబాబు లవ్ చేశాడని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అవకాశవాదంటూ సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. అవసరమైనప్పుడే చంద్రబాబు లవ్ చేస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పనని సోము వీర్రాజు తెలిపారు. జనసేన తమకు మిత్రపక్షమన్నారు.
ప్రధాని మోడీకి భద్రతకు భంగం వాటిల్లేలా పంజాబ్ రాష్ట్రంలో పరిస్థితులు సృష్టించారని ఆయన విమర్శించారు. ప్రధాని భద్రత లోపంపై నిరసనలు తెలుపుతున్నామన్నారు. ఈ విషయమై తాము గవర్నర్ ను కలుస్తామన్నారు.
2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ మిత్రపక్షంగా పోటీ చేసింది. బీజేపీతో పాటు జనసేన కూడా ఈ కూటమిలో ఉంది.ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. ఏపీ రాష్ట్రంలో టీడీపీతో బీజేపీ ప్రభుత్వంలో చేరింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ చేరింది. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ కేంద్రం నుండి వైదొలిగింది.
2019 ఎన్నికలకు ముందే టీడీపీకి జనసేన కూడా దూరమైంది. బీజేపీ, జనసేన దూరం కావడంతో 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో Jana sena లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది. బీజేపీ ఓంటరిగా పోటీకి దిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జనసేనకు ఒక్క అసెంబ్లీ సీటు దక్కింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారు.
2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీకి జనసేన దగ్గరైంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఏర్పడింది. 2024 ఎన్నికల వరకు తమ మధ్య పొత్తు ఉంటుందని బీజేపీ, జనసేన నేతలు ప్రకటించారు.
అయితే రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడక్కడ టీడీపీ, జనసేన అభ్యర్ధులు కలిసి పోటీకి దిగారు. ఈ పొత్తుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కొన్ని స్థానాలను కూడా కైవసం చేసుకొన్నాయి. ఈ పరిణామాలు రాష్ట్రంలో కొత్త కూటమి ఏర్పాటుపై ఊహగానాలు చెలరేగాయి. అయితే ఈ విషయమై జనసేన నుండి అధికారిక ప్రకటన రాలేదు.
అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇవాళ మీడియా సమావేశంలో ప్రకటించారు. పొత్తుల విషయంలో వైసీపీ నేతల తీరును కూడా చంద్రబాబు తప్పుబట్టారు. పొత్తుల వెనుక అనేక రాష్ట్ర ప్రయోజనాలుంటాయని టీడీపీ చీప్ చెప్పారు. పొత్తులపై ఇప్పటికిప్పుడే తాను వ్యాఖ్యానించలేనని కూడా చంద్రబాబు తెలిపారు.