ఎయిర్ బర్డ్స్ కోసం గంజాయి మత్తులో హత్య... జగన్ సర్కార్ పై చంద్రబాబు గరం

By Arun Kumar P  |  First Published May 9, 2023, 1:45 PM IST

విజయవాడ సమీపంలో గంజాయి సేవిస్తున్న స్నేహితుల మధ్య గొడవజరిగి ఒకరి హత్యకు దారితీసిన ఘటనపై టిడిపి అధ్యక్షులు చంద్రబాబు స్పందించారు. 


విజయవాడ  : గంజాయి మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒకరి ప్రాణాలను బలయ్యాయి. కేవలం ఇయర్ బర్డ్స్ కోసం యువకుల మధ్య మొదలైన వాగ్వాదం గొడదకు దారితీసి ఒకరి హత్యకు దారితీసింది. ఇలా గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు ఎప్పుడూ కలిసుండే స్నేహితున్నే కొట్టిచంపడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాల వల్లే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని చంద్రబాబు అన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి వినియోగం ఎక్కువయ్యిందని... దీని మత్తులో యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.ఇక కొందరు ఈ గంజాయి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలా విజయవాడ సమీపంలో గంజాయి మత్తులో స్నేహితుల మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి హత్యకు దారితీయడం దారుణమన్నారు. ఓ యువకుడి హత్యకు, మరో ఐదుగురు యువకులు హంతకులుగా మారడానకి గంజాయే కారణమని చంద్రబాబు అన్నారు. 

Latest Videos

ఏపీలో పట్టణాలు, పల్లెలు అని తేడాలేకుండా వాడవాడలా గంజాయి విస్తరించిందన్నారు. గంజాయి సాగు, వినియోగాన్ని కట్టడి చేయడంలో వైసిపి ప్రభుత్వం విఫలమయ్యిందని... ఇంత ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థంకావడం లేదన్నారు. ఒకసారి గంజాయికి అలవాటు పడిన వారి జీవితం ఎంత ప్రమాదంలోకి వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోరా? అంటూ చంద్రబాబు నిలదీసారు. 

Read More  వైసిపి ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశామంటూ ... తన చెప్పుతో తానే కొట్టుకున్న రైతన్న

వైసిపి ప్రభుత్వం, పోలీసులు, అధికారుల ఉదాసీనత వల్ల గంజాయి మహమ్మారి యధేచ్చగా సరఫరా అవుతోందని... ఇది మన బిడ్డల వరకు వస్తుందని మర్చిపోవద్దని అన్నారు. కాబట్టి  భవిష్యత్ తరాలను దృష్టిలో వుంచుకుని గంజాయి సరఫరాపై ఉక్కుపాదం మోపాలని... ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. 

అసలేం జరిగిందంటే : 

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరు స్మశానం రోడ్డులో ఆదివారం కొందరు యువకులు గంజాయి సేవించారు. ఈ మత్తులో యువకుల మధ్య ఇయర్ బర్డ్స్ గురించి గొడవ జరిగింది. ఈ క్రమంలో అజయ్ సాయి అనే యువకుడిపై మిగతా ఐదుగురు దారుణంగా దాడిచేసారు. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి యాక్సిడెంట్ జరిగిందని నమ్మించి చేర్పించారు. కానీ అతడి శరీరంపై గాయాలు ప్రమాదంలో జరిగినట్లుగా లేకపోవడంతో హాస్పిటల్ సిబ్బంది కంకిపాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం అజయ్ సాయి మృతిచెందాడు. 

యువకుడి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు ప్రస్తుతం పరారీలో వున్నారని... వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


 

click me!