ప్రజలకు సేవ చేసేందుకు సేవకుడిగా ఇక్కడ ఉన్నాను.. సీఎం జగన్

Published : May 09, 2023, 12:46 PM ISTUpdated : May 09, 2023, 01:27 PM IST
ప్రజలకు సేవ చేసేందుకు సేవకుడిగా ఇక్కడ ఉన్నాను.. సీఎం జగన్

సారాంశం

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఈరోజు శ్రీకారం చుట్టారు. 

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ఈరోజు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగ్ మాట్లాడుతూ..  ప్రభుత్వ సేవలు అందకపోతే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1902కు  కాల్ చేయవచ్చని చెప్పారు. గత ప్రభుత్వంలో అర్హులు ఉన్న పెన్షన్లు అందలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో అంతా అవినీతే కనిపించిందని అన్నారు. అర్హులైన వారందరికీ పథకాలు అందే పరిస్థితి ఉండాలని చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సమస్యలు వస్తాయని చెప్పారు. ప్రస్తు ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందిస్తుందని చెప్పారు. స్పందన ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. ఇంకా మెరుగైన పాలన తీసుకొచ్చేందుకు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 

నేరుగా ముఖ్యమంత్రికే చెబుదామనేది గొప్ప కార్యక్రమం అని అన్నారు. ఎక్కడైనా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసినా కూడా జరగకపోతే.. తాము చూపించే పరిష్కారంతో వారి ముఖంలో చిరునువ్వు చూసేలా ఈ కార్యక్రమం తీసుకొచ్చామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయని.. వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మెరుగైన ప్లాట్‌ఫామ్ తీసుకురావాలని ఈ కార్యక్రమం తీసుకొచ్చామని జగన్ తెలిపారు. 

ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది మంచి వేదిక అవుతుందని తెలిపారు. ప్రజలకు సేవ అందించేందుకే తాను ఈ స్థానంలో ఉన్నానని చెప్పారు. 1902కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే వైఎస్సార్‌ (యూవర్ సర్వీస్ రిఫరెన్స్) ఐడీ కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఆ ఫిర్యాదులను ప్రత్యక్షంగా సీఎం కార్యాలయం పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. సమస్యను ట్రాక్ చేస్తూ ఐవీఆర్ఎస్, ఎస్‌ఎంఎస్ ద్వారా స్టేటస్‌ను తెలియజేయం జరుగుతుందని చెప్పారు. సమస్యల పరిష్కారానికి మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు.  

ప్రజలకు ఒక సేవకుడిగా సేవలు అందించేందుకే తాను ఇక్కడ ఉన్నానని తెలిపారు. సీఎం స్థానం నుంచి మొదలుపెడితే.. ప్రతి అధికారి కూడా ప్రజా సేవకులమేనని చెప్పారు. అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూసేందుకు చేస్తున్న కార్యక్రమం అని తెలిపారు. ప్రజల్లో ప్రభుత్వ గౌరవాన్ని పెంచే కార్యక్రమని చెప్పారు. ప్రజలకు మరింత మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టుగా తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు