ప్రజల తరఫున పోరాడే శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నా: చంద్రబాబు నాయుడు

Published : Apr 20, 2022, 12:46 PM ISTUpdated : Apr 20, 2022, 02:30 PM IST
ప్రజల తరఫున పోరాడే శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నా: చంద్రబాబు నాయుడు

సారాంశం

ప్రజల తరఫున పోరాడే శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను కోరానని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను చంద్రబాబు దర్శించుకున్నారు.  

ప్రజల తరఫున పోరాడే శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను కోరానని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం 73వ పుట్టిన రోజు జరుపుకుంటున్న చంద్రబాబు.. ఉదయం బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆలయ మర్యాదలతో చంద్రబాబుకు అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత చంద్రబాబు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు.. అమ్మవారి చిత్ర పటం, తీర్ధ ప్రసాదాలను చంద్రబాబుకు అందజేశారు. చంద్రబాబుతో పాటు దుర్గమ్మను దర్శించుకున్నవారిలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నాయకుడు బుద్ద వెంకన్న కూడా ఉన్నారు. 

దుర్గమ్మ  దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తరఫున నిబలడి, వారి కష్టాలను తొలగించే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ప్రజలకున్న ఇబ్బందులను తొలగించాలని వేడుకున్నట్టుగా తెలిపారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇందులో తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. రాజీ లేని పోరాటంతో ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. ప్రపంచంలో తెలుగు వాళ్లు ఎక్కడున్నా.. టీడీపీ వాళ్ల సంక్షేమం కోసం పోరాడుతుందన్నారు. తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడబోనని చెప్పారు. 

ఇక, చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలుచోట్ల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా పలువురు ఆయనకు విషెస్ చెబుతున్నారు. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన కుమారుడు నారా లోకేష్.. ‘‘జన్మనిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు.. అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు చెప్పాడు. ఆ ప్రకారంగా చూస్తే ఆయన దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారు.

ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా.లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన. సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు. నాన్నగారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్