Andhra News: వైసిపి వీడి టిడిపిలో చేరిక... లోకేష్ తో రహస్య భేటీ ప్రచారం: క్లారిటీ ఇచ్చిన బైరెడ్డి సిద్దార్థ్

Arun Kumar P   | Asianet News
Published : Apr 20, 2022, 11:15 AM ISTUpdated : Apr 20, 2022, 11:28 AM IST
Andhra News: వైసిపి వీడి టిడిపిలో చేరిక... లోకేష్ తో రహస్య భేటీ ప్రచారం: క్లారిటీ ఇచ్చిన బైరెడ్డి సిద్దార్థ్

సారాంశం

అతిచిన్న వయసులోనే మంచి ఫాలోయింగ్ సాధించి వైసిపిలో రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగిన బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసిపి ని వీడి టిడిపిలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బైరెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

కర్నూల్: పదునైన మాటలు, విలక్షణ వ్యక్తిత్వంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి యూత్ ఫాలోయింగ్ సాధించిన భైరెడ్డి సిద్దార్థరెడ్డి (byreddy siddarth reddy) రాజకీయంగానూ మంచి స్థాయిలో వున్నారు. చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (ys jagan) దృష్టిలో పడి ఇటీవలే షాప్ ఛైర్మన్ గా నామినేటెడ్ పదవిని కూడా పొందాడు. ఇలా వైసిపి (ysrcp)లో మంచి గుర్తింపు వుండగా బైరెడ్డి టిడిపి (TDP) వైపు చూస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) తో కూడా రహస్యంగా సమావేశమై టిడిపి చేరడానికి సిద్దార్థ్ ఆసక్తి చూపినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా తన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై సిద్దార్థ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

తాను కష్టకాలంలో వుండగా పార్టీలో చేర్చుకుని ఓ వేదికను ఇచ్చిన వైఎస్ జగన్ వెంటే జీవితాంతం వుంటానని సిద్దార్థ్ తెలిపారు. తనను తమ్ముడిలా చూసుకుంటూ మంచి అవకాశాలు కల్పిస్తున్న జగనన్నను దూరం చేసుకుని వైసిపి నుండి టిడిపిలోకి జంప్ అయ్యే అవసరం తనకు లేదన్నారు. తాను ఎప్పటికీ వైఎస్ జగన్ విధేయుడినే... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తనదని సిద్దార్థ్ అన్నారు. 

తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని... అందుకు కొన్ని మీడియా సంస్థలు సహకరిస్తున్నాయని తెలిపారు. తాను టిడిపిలో చేరుతున్నట్లు వార్తలన్నీ అవాస్తమేనని... తనకెంత గడ్డు పరిస్థితులు ఎదురయినా వైసిపిని వీడబోనని బైరెడ్డి స్పష్టం చేసారు. 

పార్టీలో చేర్చుకుని అతిచిన్న వయసులోనే నందికొట్కూరు (nandikotkuru) ఇంచార్జి బాధ్యతలు అప్పగించి, అధికారంలోకి వచ్చాక షాప్ ఛైర్మన్ పదవి ఇచ్చి ఇలా సీఎం జగన్ తనకెంతో చేసారన్నారు. ఇన్ని అవకాశాలిచ్చిన పార్టీని తానెందుకు వీడతాను... ఆ ఆలోచన కూడా రానివ్వనని అన్నారు. రాజకీయంగా నేనంటే గిట్టనివారు... కొన్ని మీడియా సంస్థలు బ్రేకింగ్ ల కోసమే ఇలా పార్టీ మారుతున్నానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని సిద్దార్థ్ మండిపడ్డారు. 

అప్పుడెప్పుడో తాను వైసిపిలో చేరకముందు నారా లోకేష్ ను కలిసానని... పార్టీని కాపాడుకున్న కార్యకర్తలను కాపాడుకోవాలని కోరినట్లు సిద్దార్థ్ గుర్తుచేసారు. అయితే  తనలాంటి యువకులు టిడిపికి అక్కర్లేదని... డబ్బులు ఖర్చుపెట్టేవారే కావాలని వేరేవారిని లోకేష్ పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. కానీ వైఎస్ జగన్ అలా కాకుండా యువకుడినైన తనను వెన్నుతట్టి ప్రోత్సహించి ఏకంగా ఓ నియోజవర్గ ఇంచార్జిగా నియమించి పార్టీ గెలుపు బాధ్యతను తనకు అప్పగించారన్నారు. తనను ఇంతలా నమ్మిన జగన్ నాయకత్వంలో ఎప్పటికీ పనిచేస్తానని బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్ఫష్టం చేసారు. 

బైరెడ్డి పార్టీ మార్పు ప్రచారం:  

షాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి టిడిపి చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాతో పాటు కొన్ని ప్రధాన మీడియా ఛానళ్ళలో కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. సిద్దార్థ్ కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించేందుకు కొందరు పార్టీపెద్దలు ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే సిద్దార్థ్ సొంత నియోజకవర్గం నందికొట్కూరులో ఆయన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారట. అందువల్లే సిద్దార్థ్ పార్టీ మారడానికి సిద్దపడినట్లు... టిడిపి మంచి అవకాశాలిస్తామని హామీ ఇవ్వడంతో అటువైపు చూస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే సిద్దార్థ్ మాత్రం తాను పార్టీ మారడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదని... వైసిపిలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియా పరిశ్రమకు శంకుస్థాపన చేసిన సీఎం | Asianet
CM Chandrababu Naidu: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమ్మోనియాచంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu