కుర్చీని మడతబెడితే...: సీఎం జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్

కుర్చీని మడతపెడితే...  ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరికీ తెలుసు., అయితే ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఈ డైలాగ్ వాడి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చారంటే ఏపీ రాజకీయాలు ఎంత వాడివేడిగా వున్నాయో అర్థమవుతుంది. .  


విజయవాడ :ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసిపి నాయకులు చొక్కాలు మడతపెట్టే సమయం వచ్చిందన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. వైసిపి నాయకులు చొక్కాలు మడతపెడితే టిడిపి, జనసేన కార్యకర్తలు, ప్రజలు చూస్తూ ఊరుకోరు...  కుర్చీలు మడతపెడతారు... అప్పుడు ముఖ్యమంత్రి కుర్చీయే వుండదంటూ వైఎస్ జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 

సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన 'విధ్వంసం' పుస్తకాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలి పుస్తకాన్ని ఆవిష్కరించి పవన్ కల్యాణ్ కు అందించారు చంద్రబాబు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై, సీఎం వైఎస్ జగన్ వ్యవహారతీరుపై తీవ్ర విమర్శలు చేసారు. 

Latest Videos

గత ఐదేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో విధ్వంస పాలన సాగుతోందని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి చొక్కాలు మడతపెట్టాలంటూ రెచ్చగొడుతున్నారంటేనే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మంచికి కూడా హద్దులు వుంటాయి... పిచ్చిపిచ్చి కూతలు కూస్తూ ప్రజలే బుద్ది చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు.  

Read More  విజయవాడలో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నదే కేశినేని నాని : బుద్దా వెంకన్న సంచలనం 

వైసిపి పాలనలో ప్రతి ఒక్కరు బాధితులే...  దళితులు, అమరావతి రైతులు, ఉద్యోగులు... చివరకు తాను, పవన్ కళ్యాణ్ కూడా బాధితులమేనని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ విధ్వంస పాలనగురించి పుస్తకం రాసారు కాబట్టి రేపో ఎల్లుండే ఆలపాటి సురేష్ కుమార్ కూడా బాధితుడు అవుతాడన్నారు.

వైసిపి పాలించిన ఈ ఐదేళ్లలో జరిగిన సంఘటనలు ధైర్యంగా విధ్వంసం పుస్తకంలో సురేష్ పొందుపరిచారని చంద్రబాబు తెలిపారు. ఇది కేవలం పుస్తకం మాత్రమే కాదు..సమాజాన్ని, ప్రభుత్వాన్ని దగ్గరగా చూసిన ధర్మాగ్రహమని అన్నారు. అందరం చాలా పుస్తకాలు చదువుతాం....  సమాజ పోకడలు, విప్లవాలు, ఉద్యామాలపై పుస్తకాలు రాయడం మనం చూశాం... కానీ ఓ ప్రభుత్వం, పాలకులు రాష్ట్రాన్ని ఎలా విధ్వంసం చేసారో ఓ పుస్తకమే రాయడం ఏపీలోనే జరిగిందన్నారు. ప్రభుత్వ టెర్రరిజంపై పుస్తకం తీసుకురావడం చాలా సంతోషకరమని చంద్రబాబు అన్నారు. 

తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలని తాను, పవన్ సంకల్పిస్తున్నామని...  అధికారంలోకి వచ్చాక తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయడానికి కృషిచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాబట్టి టిడిపి-జనసేనను గెలిపించుకునేందుకు వైసిపిపై తిరగబడతారో లేక ఇలాగే బానిసలుగా వుంటారో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. ఎన్నికలకు మరో 54 రోజుల సమయం మాత్రమే వుంది... ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. 

click me!