తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని చేసిన ఆరోపణలకు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయవాడలో సెక్స్ రాకెట్ సాగుతోందని... ఆ కథేంటో త్వరలో బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేసారు.
అమరావతి : విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టిడిపి నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. విజయవాడలోని నాని హోటల్లో సెక్స్ రాకెట్ నడుస్తోందని... ఆ కథేంటో త్వరలోనే తేలుస్తామని హెచ్చరించారు. ఇప్పుడే కాదు గతంలో కూడా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, డిల్లీ నగరాల్లో గెస్ట్ హౌస్ లు నిర్వహిస్తూ నాని సెక్స్ రాకెట్ నడిపాడని విమర్శించారు. ఇక ఇప్పుడు ఏకంగా లైసెన్స్ తీసుకున్నట్లు విజయవాడ హోటల్లోనే సెక్స్ దందా నడిపిస్తున్నాడంటూ కేశినేని నానిపై బుద్దా తీవ్ర ఆరోపణలు చేసారు.
ఇక చంద్రబాబు నాయుడు టిడిపి టికెట్లు అమ్ముకుంటున్నాడన్న నాని ఆరోపణలకు వెంకన్న కౌంటర్ ఇచ్చారు. కేశినేని నాని ఓ బ్రోకర్... బస్సు టికెట్లను బ్లాక్ అమ్ముకుంటాడని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి చంద్రబాబు లాంటి నాయకుడిపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరని అన్నారు. ప్రజారాజ్యం పార్టీలో కొనసాగినప్పుడు కూడా ఇలాగే చిరంజీవి టికెట్లు అమ్ముకున్నారని నాని ఆరోపణ చేశారని గుర్తుచేసారు. ఇప్పుడు చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని వెంకన్న మండిపడ్డారు.
Also Read MP Balashowry: 23000 కోట్ల జగన్ సోలార్ స్కాం.. బాలశౌరి సంచలన ఆరోపణలు
కేశినేని నాని నిజస్వరూపం తెలిసే చంద్రబాబు పార్టీలోంచి మెడపట్టుకుని గెంటేసారని బుద్దా వెంకన్న అన్నారు. దీంతో వైఎస్ జగన్ పంచనచేరి అవాకులు చవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు కర్ణుడిలాంటి వారు... ఒకరికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదన్నారు. కానీ వైఎస్ జగన్, కేశినేని నాని యాచకులు... తీసుకోవడం, దోచుకోవడమే వారికి తెలుసన్నారు.
వైఎస్ జగన్ వైసిపి టికెట్లు అమ్ముకుంటున్నాడు... నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెడ్లను 140-150 కోట్ల రూపాయలు అడిగారని వెంకన్న తెలిపారు. వాళ్ళు ఇవ్వమంటే టికెట్లు ఎగ్గొట్టాడన్నారు. కానీ చంద్రబాబు నాని దగ్గర రూపాయి తీసుకోకుండా రెండుసార్లు టికెట్లు ఇచ్చారని... టిడిపి నాయకులే డబ్బులు ఖర్చుచేసి ఆయనను గెలిపించుకున్నారని అన్నారు. అలాంటి టిడిపిపై, అధినేత చంద్రబాబుపై నాని విశ్వాసం చూపించలేదన్నారు. ఇంకొకసారి చంద్రబాబు మీద పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కేశినేని భవన్ కి వెళ్లిమరీ దాడి చేస్తామని వెంకన్న హెచ్చరించారు.