పృథ్వీపై దిశ చట్టం కింద కేసు పెట్టాలి: చంద్రబాబు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 13, 2020, 6:02 PM IST
Highlights

ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, సినీనటుడు పృథ్వీరాజ్‌పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సోమవారం అనంతపురం జిల్లాలో మీడియాంతో మాట్లాడిన ఆయన.. కాకినాడలో ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించినా కేసు ఎందుకు నమోదు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. 
 

ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, సినీనటుడు పృథ్వీరాజ్‌పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సోమవారం అనంతపురం జిల్లాలో మీడియాంతో మాట్లాడిన ఆయన.. కాకినాడలో ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో దూషించినా కేసు ఎందుకు నమోదు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

వైసీపీ నేతలు తనను నేరుగా అడ్డుకునే ధైర్యం లేక పోలీసుల సాయంతో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పవిత్రమైన ఎస్వీబీసీ కార్యాలయంలో ఇలాంటి చర్యలకు పాల్పడిన పృథ్వీ ఒక్క రాజీనామా చేస్తే సరిపోదన్నారు. రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు

Also Read:జగన్ సర్కార్ సంచలనం... అమరావతిలో స్థానిక ఎన్నికల్లేవ్!

టీడీపీ అధినేత , ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. అమరావతి పరిరక్షణ యాత్రంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం జిల్లా పెనుగొండలో పర్యటించి.. జోలె పట్టి విరాళాలు సేకరించారు.

ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అనుకూలంగా తీర్పు ఇస్తే రాజధాని విశాఖకు మార్చుకోవచ్చునన్నారు. వైసీపీ గనుక ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజకీయాలే వదిలేస్తానని, సీఎం జగన్ దీనికి ఎలాగూ ఒప్పుకోరని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజధానిపై ఓటింగ్ నిర్వహించి అమరావతా..? విశాఖ అన్నది తేల్చాలని టీడీపీ చీఫ్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

Also Read:జగన్ మీద ఫైట్: బిజెపి అస్త్రం పవన్ కల్యాణ్, చంద్రబాబు వెనక్కి..

జీఎన్ రావు, బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదికలు బోగస్ రిపోర్టులని వాటిని భోగి మంటల్లో వేసి చలికాచుకోవాలని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు ప్రజలంతా ఒప్పుకున్నారని, రాష్ట్రానికి రాజధానిగా అమరావతే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లు టీడీపీ చీఫ్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతోందని తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సైతం బాధపడ్డారని చంద్రబాబు అన్నారు. ఏపీలో మూడు రాజధానులు వస్తే తమకే లాభమని తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యానించారని బాబు గుర్తుచేశారు. 

click me!