జగన్ కూతుళ్లను క్వారంటైన్ చేయాలి: చంద్రబాబు కామెంట్స్

By Siva KodatiFirst Published Mar 18, 2020, 7:05 PM IST
Highlights

విదేశాల నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కుమార్తెలను ఇంట్లోనే ఉంచి క్వారంటైన్ చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం తీవ్ర నష్టాల ఊబీలోకి కూరుకుపోయిందని కానీ దీనిపై జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించడం లేదన్నారు. 

విదేశాల నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కుమార్తెలను ఇంట్లోనే ఉంచి క్వారంటైన్ చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం తీవ్ర నష్టాల ఊబీలోకి కూరుకుపోయిందని కానీ దీనిపై జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించడం లేదన్నారు. కరోనాను పక్కనబెట్టి ప్రతిరోజూ తనను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

స్థానిక సంస్థల నిర్వహణపై సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సుప్రీంకోర్టు తీర్పు సంచలన తీర్పు నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సుప్రీంకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏంటని ప్రతిపక్షనేత ప్రశ్నించారు.

Also Read:జగన్‌కు ఈసీ రమేశ్ కుమార్ మరో షాక్: కేంద్రానికి సీరియస్ లేఖ

మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నేతలు ఎన్నికల కమీషనర్‌ను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును సైతం వైసీపీ నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారని.. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయంలో తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ జోక్యం చేసుకోమని సుప్రీం చెప్పిన విషయాన్ని ప్రతిపక్షనేత ప్రస్తావించారు. తిట్టడం నిమిషం పని.. తిట్టలేకకాదన్నారు. అఫిడవిట్‌లో కేంద్ర నిధులు రావని ఎందుకు చెప్పలేదని ప్రతిపక్షనేత ప్రశ్నించారు.

Also Read:లండన్ నుంచి కూతుర్లు వెనక్కి: జగన్ పారాసిటమాల్ వ్యాఖ్యలపై సెటైర్లు

ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని కరోనాకు పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ చాలా అని చంద్రబాబు దుయ్యబట్టారు. బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ చల్లాలి, మొహంపై చల్లాలా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

జగన్ పొరపాటున చెప్పి ఉండొచ్చునని... సరిదిద్దుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడకూడదని ఇకపై మంత్రులు బూతు పురాణం మానేస్తే మంచిదని టీడీపీ అధినేత అన్నారు. 

click me!