బూతుల మంత్రి.. జగన్‌ దగ్గరికి దర్జాగా వెళ్లొస్తాడు: కొడాలి నానికి చంద్రబాబు చురకలు

Siva Kodati |  
Published : Mar 07, 2021, 03:47 PM IST
బూతుల మంత్రి.. జగన్‌ దగ్గరికి దర్జాగా వెళ్లొస్తాడు: కొడాలి నానికి చంద్రబాబు చురకలు

సారాంశం

మంత్రి కొడాలి నానిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన రోడ్‌ షోలో మాట్లాడిన చంద్రబాబు.. ‘‘ఒకడు బూతుల మంత్రి... నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడంటూ ఫైరయ్యారు.

తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి దర్జాగా బయటకు వస్తాడని.. అంటే సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా అంటూ కొడాలి నానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని ఆయన వాపోయారు. పేదవారికి కనీసం ఐదు రూపాయల భోజనం పెడుతుంటే... టీడీపీకి పేరొస్తుందనే భయంతో.. అన్నా క్యాంటీన్‌లను నిరుపయోగం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతా అన్న జగన్ ఆ విషయంలో ఏం చేశారంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఏమైంది? ఎవరికైనా న్యాయం జరిగిందా.. అని ప్రశ్నించారు. తమ పాలనలో నిరుద్యోగ భృతి ఇచ్చామని, ఇప్పుడు దానిని తీసేశారని, పెళ్లి కానుక రావడం లేదని, భరోసాను పెంచామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం