కేశినేని నాని అంటే బాబుకు భయం: వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 07, 2021, 03:09 PM IST
కేశినేని నాని అంటే బాబుకు భయం: వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

విజయవాడ మేయర్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఆదివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయవాడ ప్రజలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకి లేదన్నారు. 

విజయవాడ మేయర్ పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. ఆదివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయవాడ ప్రజలను ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకి లేదన్నారు.

కరోనా  సమయంలో టిడిపిలో చంద్రబాబు సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరును ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని.. ఆయన ఓటర్లను ఎంత మభ్య పెట్టినా చివరకు రాష్ట్ర ప్రజలు వైసిపికే అండగా ఉంటారని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అడ్రెస్ గల్లంతు అవుతుందని.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మోపిన పన్నుల భారాన్ని రాష్ట్ర ప్రజలు మరిచి పోలేదని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. చంద్రబాబు విజయవాడ పర్యటన వల్ల ఒరిగేదేమి లేదని.. ఆయన పిలిస్తే పలికే స్థితిలో విజయవాడ ప్రజలు లేరని స్పష్టం చేశారు.

టీడీపీలో అంతర్గత విభేదాలను సరిదిద్దు కొలేని చంద్రబాబు ప్రజలకు ఏం చేస్తారని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఒక ఎంపినీ కంట్రోల్ చేసుకోలేని చంద్రబాబు ఒక నాయకుడేనా అంటూ శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఎంపి కేశినేని నానికి భయపడి చంద్రబాబు ఏం చేయలేని పరిస్థితిలో వున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టిడిపిలో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరిందని..  కరోనా సమయంలో హైదరాబాద్‌లో దాక్కున్న తండ్రీ కొడుకులు ఇప్పుడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని శ్రీనివాసరావు నిలదీశారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్దినీ చూసి రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే విజయాన్ని అందిస్తారని వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్