ఐదు వార్డుల్లో టీడీపీ గెలిచినా రాజీనామా చేస్తా: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా సంచలనం

By narsimha lode  |  First Published Mar 7, 2021, 3:37 PM IST

వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఐదు వార్డుల్లో గెలిచినా కూడ రాజీనామా చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. 


వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఐదు వార్డుల్లో గెలిచినా కూడ రాజీనామా చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. ఆదివారం నాడు ఆయన వినుకొండలో మీడియాతో మాట్లాడారు. వినుకొండలో 32 వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

వినుకొండలో ఐదు వార్డులను టీడీపీ గెలిచినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని  మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఆంజనేయులుకు చెప్పినట్టుగా ఆయన గుర్తు చేశారు.అయితే ఈ సవాల్ పై ఆంజనేయులు ఏం సమాధానం చెప్పలేదన్నారు.

Latest Videos

పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. ఇంత కష్టపడుతున్నందున తమ కష్టాన్ని గుర్తించి వినుకొండలో టీడీపీకి ఐదు సీట్లు కూడ దక్కకుండా చూడాలని ఆయన ప్రజలను కోరారు. 

వినుకొండలో వక్ఫ్ భూములను టీడీపీ, సీపీఐ నేతలు అమ్ముకొంటున్నారని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు.ఈ కుంభకోణాన్ని వెలికి తీస్తామని ఆయన చెప్పారు.
 

click me!