రాజధానిని నిర్మించలేని ప్రభుత్వానికి రాజధాని కోసం సేకరించిన భూములను విక్రయించే హక్కు ఎక్కడిదని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో ఇవాళ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
Chandrababu Naidu ప్రశ్నించారు.
సోమవారం నాడు TDP స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. Amaravathi రాజధాని భూములు విక్రయించాలని YS Jagan సర్కార్ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు స్పందించారు.అమరావతిని స్మశానం అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్ముతుందని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం కట్టిన భవనాలను ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇస్తారా అని అడిగారు.డబ్బులు పంచినా ఆత్మకూరులో వైసీపీకి ఓట్లు పెరగలేదని చంద్రబాబు చెప్పారు. YCP పాలనలో పన్నుల వాతలు, పథకాలకు కోతలు పెరిగాయని చంద్రబాబు విమర్శించారు. జగన్ అమ్మఒడిలో 52 వేల మంది లబ్దిదారులు తగ్గారని చంద్రబాబు ఆరోపించారు. . ఒంటరి మహిళల పెన్షన్ లో ఆంక్షలు అమానవీయమని చంద్రబాబు చెప్పారు.
ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని భూములను సీఆర్ డీఏ భూములను అమ్మాలని నిర్ణయించింది. రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా రాజధాని భూములను విక్రయించాలని సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాల భూముల విక్రయానికి సర్కార్ నిర్ణయం తీసుకుంది. కనీస ధర ఎకరాకు రూ.10 కోట్లుగా నిర్థారించింది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతినిస్తూ ఈ నెల 26న జీవో నెం 389 జారీ చేసింది ప్రభుత్వం.
వచ్చే నెలలోనే భూములను వేలం వేయనుంది సీఆర్‌డీఏ. మరో 600 ఎకరాల భూమి కూడా అమ్మాలని సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో సొంతంగా నిధుల సమీకరణకు దిగింది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో బీఆర్ షెట్టి మెడిసిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి ఇచ్చిన 148 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదికి 50 ఎకరాల చొప్పున 600 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది
అమరావతిలో ఏపీ రాజధాని అభివృద్ధికి నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ కసరత్తు చేస్తోంది. దీని కోసం రాజధాని పరిధిలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవనాలను లీజుకు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఉద్యోగుల వసతి కోసం నిర్మిస్తోన్న డీ టైప్ భవనాలను లీజుకు ఇచ్చేలా సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీ టైప్ బిల్డింగ్స్‌లోని ఓ టవర్‌ని లీజుకు తీసుకోవడానికి విట్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. దీంతో విట్ యాజమాన్యంతో సీఆర్‌డీఏ చర్చలు జరుపుతోంది. లీజు ద్వారా ఏడాదికి రూ.8 నుంచి రూ.10 కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం వుందని అంచనా. ఒక్కో టవర్‌లో 120 ప్లాట్లు వున్నాయి.