శ్రీకాకుళంలో సీఎం జగన్ పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి చేదు అనుభవం..

By Sumanth KanukulaFirst Published Jun 27, 2022, 11:51 AM IST
Highlights

కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణికి చేదు అనుభవం ఎదురైంది. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనునున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు ఆమె హెలిప్యాడ్ వద్దకు వెళ్లాలని చూసిన కిల్ల కృపారాణిని.. అధికారులు అనుమతించలేదు.

కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు కిల్లి కృపారాణికి చేదు అనుభవం ఎదురైంది. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనునున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు ఆమె హెలిప్యాడ్ వద్దకు వెళ్లాలని చూసిన కిల్ల కృపారాణిని.. అధికారులు అనుమతించలేదు. సీఎం జగన్‌కు ఆహ్వానం పలికేవారి జాబితాలో ఆమె పేరు లేదని చెప్పడంతో ఆమె అసంతృప్తికి లోనయ్యారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగారు. 

దీంతో అక్కడున్న వైసీపీ నాయకులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్రమంత్రిగా పనిచేసిన తాను ఎవరో జిల్లా కలెక్టర్, అధికారులకు తెలియదా.. నాకు జరిగిన అవమానం ఇక చాలు అంటూ కిల్లి కృపారాణి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆమె అక్కడి నుంచి వెళ్తుండగా మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణాదాస్ కిల్లి కృపారాణికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. 

ఇదిలా ఉంటే సీఎం జగన్ కొద్దిసేపటి క్రితం శ్రీకాకుళం చేరుకున్నారు.  మరికాసేపట్లో జగనన్న అమ్మ ఒడి మూడో విడుత నగదు విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అమ్మ ఒడి పథకం లబ్ధిదారులతో ముఖాముఖి అనంతరం సీఎం జగన్‌ ప్రసంగిస్తారు. కార్యక్రమం తర్వాత బయలుదేరి.. తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  

click me!