టీడీపీ నేత వరుపుల రాజాకు చంద్రబాబు నివాళులు

Published : Mar 05, 2023, 04:54 PM IST
 టీడీపీ నేత  వరుపుల రాజాకు  చంద్రబాబు నివాళులు

సారాంశం

గుండెపోటుతో  మృతి చెందిన  టీడీపీ నేత   వరుపుల రాజా  బౌతిక కాయానికి  చంద్రబాబునాయుడు నివాళులర్పించారు.   


కాకినాడ: టీడీపీ నేత వరుపుల రాజా బౌతిక కాయానికి  చంద్రబాబునాయుడు  ఆదివారం నాడు  నివాళులర్పించారు.  శనివారం నాడు రాత్రి గుండెపోటుతో  వరుపుల రాజా గుండెపోటుతో  మృతి చెందాడు.  ఇవాళ  మధ్యాహ్నం  ప్రత్తిపాడులోని   వరుపుల రాజా బౌతిక కాయానికి  చంద్రబాబు నివాళులర్పించారు.  రాజా కుటుంబ సభ్యులను  చంద్రబాబు ఓదార్చారు.  రాజా కుటుంబానికి అండగా  ఉంటామని  చంద్రబాబు  ప్రకటించారు. 

also read:టీడీపీ నేత వరుపుల రాజా గుండెపోటుతో మృతి

వరుపుల రాజాకు  గతంలో రెండు దఫాలు   గుండెపోటు వచ్చింది.  గుండెపోటు కారణంగా  రాజాకు  గతంలోనే స్టంట్లు  వేశారు.   నిన్న రాత్రి  గుండెలో  నొప్పిగా  ఉందని  చెప్పడంతో  కుటుంబ సభ్యులు ఆయనను కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  రాజా మృతి చెందాడు.  
 

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం