ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదు.. సీఎం జగన్‌ని చూడండి : చంద్రబాబుపై బొత్స విమర్శలు

Siva Kodati |  
Published : Mar 05, 2023, 03:47 PM IST
ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదు.. సీఎం జగన్‌ని చూడండి : చంద్రబాబుపై బొత్స విమర్శలు

సారాంశం

ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాకుండా హుందాగా వుండటం నేర్చుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో చాలా క్రమశిక్షణతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహించారని జగన్‌ను ప్రశంసించారు.   

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆదివారం విజయనగరంలోఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో సమ్మిట్‌లు నిర్వహించారని, కానీ తాను తప్ప ఎవరూ దానిని చేయలేరంటూ గొప్పలు చెప్పుకునేవారని బొత్స దుయ్యబట్టారు. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదని.. తమలా చేసి చూపించాలని సవాల్ బొత్స సవాల్ విసిరారు. సీఎం జగన్ విశాఖలో చాలా క్రమశిక్షణతో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహించారని బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. దేశంలో వున్న పారిశ్రామికవేత్తలంతా ఈ సమ్మిట్‌కు హాజరై.. హుందాగా ఎంవోయూలు కుదుర్చుకున్నారని బొత్స పేర్కొన్నారు. ఓ కమిటీని వేసి.. దానిని జగన్ నిరంతరం పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని మంత్రి కొనియాడారు. ఒప్పందం చేసుకోవడం ముఖ్యం కాదని.. వాటి గ్రౌండింగ్ కూడా ముఖ్యమేనని బొత్స తెలిపారు. ఇక ఈ నెల 13న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అందరికీ ప్రతిష్టాత్మకమేనని సత్యనారాయణ పేర్కొన్నారు. 

అంతకుముందు మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తొందరపాటుతో పోలవరం ప్రాజెక్ట్‌కు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. గోదావరికి‌ వచ్చిన వరదలు డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించడం.. అప్పర్, లోయర్ కాపర్ డ్యామ్ పనులు పూర్తి చేయకపోవడం వల్ల.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని అన్నారు. తాను రాజకీయ ఆరోపణలు చేయడం లేదని మంత్రి చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అవగాహన లేకనో, తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయాలనో కాపర్ డ్యామ్‌లను పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వేయటం వలన అనర్థం జరిగిందనేది నిపుణుల అభిప్రాయం అని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ వేసి.. కాపర్ డ్యామ్‌లు కట్టకపోయిన ఇంత అనర్థం జరిగేది కాదని అంబటి అభిప్రాయపడ్డారు. డయాఫ్రమ్‌వాల్‌ దెబ్బతినడానికి ముమ్మాటికీ మానవతప్పిదమేనని అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతుందని రాంబాబు చెప్పారు. గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూసెక్కుల ఇసుక అవసరం అని చెప్పారు. 

Also REad: 352 ఎంవోయూలు.. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు.. చిత్తశుద్దితో అడుగులు: సీఎం జగన్

డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో పాడైన భాగాలు రిపేర్‌ చేయడం కోసం రూ.2 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారని చెప్పారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంలో దెబ్బతిన్న భాగం మొత్తం బాగుచేసి ఎలా పనులు ముందుకు తీసుకెళ్లాలని అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే నాలుగైదు నెలలు కీలకమని చెప్పారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తొందరపాటు, డెడ్‌లైన్‌లు ఎందుకని ప్రశ్నించారు. వేళ ఏళ్ల పాటు ప్రజలకు సదుపాయాలు అందించాల్సిన ప్రాజెక్టు‌ పనులు  కాస్త ఆలస్యమైనా నాణ్యతతో ఉండాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ కలలు కన్న ప్రాజెక్టు పోలవరం అని.. దీనిని సీఎం జగన్ చేతుల మీదుగానే ప్రారంభిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్‌లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఆధునిక అగ్నిమాప‌ వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu Naidu: ఏపీకి 252.93 కోట్లతో కొన్న ఆధునిక అగ్నిమాపక వాహనాలు| Asianet News Telugu