
పేద కుటుంబంలో పుట్టిన ఆదివాసీ అయినప్పటికీ.. ఆమె హుందాగా వ్యవహరిస్తున్నారని ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మును (draupadi murmu) ప్రశంసించారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో (presidential election 2022) భాగంగా విజయవాడ గేట్ వే హోటల్ లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆదివాసీలు, పేదల కోసం ద్రౌపది ముర్ము పనిచేశారని ఆయన అన్నారు. చాలా పేదరికంలో పుట్టి. కష్టపడి చదువుకుని ఈరోజు రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యారని చంద్రబాబు అన్నారు.
గిరిజనులను, ఆదివాసీలను పైకి తీసుకు రావడం అనేది అరుదుగా జరుగుతుందన్నారు. అలాంటి పరిస్ధితుల్లో ఒక సామాజిక న్యాయం కోసం ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం అభినందనీయమని చంద్రబాబు పేర్కొన్నారు. తన ఆధ్వర్యంలో కేఆర్ నారాయణన్ ను (kr narayanan) రాష్ట్రపతిగా ఎంపిక చేశామని, ఆ తర్వాత అబ్దుల్ కలాంను (apj abdul kalam) అత్యున్నత పదవికి ఎంపిక చేసే వ్యవహారంలో కీలక పాత్ర పోషించామన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు అభినందించారు.
ALso REad:రాష్ట్రపతి ఎన్నికల్లో ఆశీర్వదించండి:వైసీపీ ప్రజా ప్రతినిధుల భేటీలో ద్రౌపది ముర్ము
అంతకుముందు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని తొలి గిరిజన గవర్నర్ గా ద్రౌపది ముర్ము రికార్డుల్లోకెక్కారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ద్రౌపది ముర్ము ఇవాళ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ వేదికపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీస్సులతో ద్రౌపది ముర్మకు రాష్ట్రపతి అభ్యర్ధిగా అవకాశం లభించిందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దళితులు, గిరిజనులకు అవకాశం కల్పించారని ఆయన గుర్తుచేశారు.
వాజ్ పేయ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు అబ్ధుల్ కలాంను రాష్ట్రపతిగా చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు షెడ్యూల్డ్ కులాలకు చెందిన రామ్ నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేశామని కేంద్ర మంత్రి తెలిపారు. బ్రహ్మకుమారీ సమాజంలోనూ ద్రౌపది ముర్ము కీలకపాత్ర పోషించారని ఆయన తెలిపారు.