కుటుంబ సభ్యులతో చంద్రబాబు భేటీ రద్దు.. రేపు కలిసే ఛాన్స్..?

రాజమండ్రి సెంట్రల్ జైలులో కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ రద్దయ్యింది. హౌస్ అరెస్ట్ పిటిషన్ తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

tdp chief chandrababu naidu meeting with family members canceled ksp

రాజమండ్రి సెంట్రల్ జైలులో కుటుంబ సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ రద్దయ్యింది. దీనికి బదులుగా రేపు ఆయన ఫ్యామిలీని కలవనున్నారు. మరోవైపు అందుబాటులో వున్న నేతలతో నారా లోకేష్ భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్, తర్వాత జరిగిన పరిణామాలపై ఆయన చర్చిస్తున్నారు. ఇకపోతే.. చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. హౌస్ అరెస్ట్ పిటిషన్ తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో 14 రోజుల రిమాండ్ విధించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే జైలులో ప్రత్యేక వసతులు కల్పించేందుకు కోర్ట్ అనుమతించింది. ఈ క్రమంలోనే చంద్రబాబు కోసం సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి భోజనం వచ్చింది. చంద్రబాబుకు మధ్యాహ్నం భోజనంగా 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపారు కుటుంబ సభ్యులు. 

Latest Videos

Also Read: చంద్రబాబు కోసం ఇంటి భోజనం.. మెనూ ఇదే, కాసేపట్లో కుటుంబ సభ్యులతో భేటీ

మరోవైపు.. చంద్రబాబు నాయుడు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ.. మరో కేసులో కూడా ఆయనపై పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అవకతవకలకు సంబంధించిన కేసులో చంద్రబాబును విచారించేందుకు అనుమతి కోరుతూ సీఐడీ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా సమాచారం. అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో కూడా చంద్రబాబు అరెస్ట్‌ కోసం పీటీ వారెంట్‌ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరనున్నట్టుగా తెలుస్తోంది. 2022లో నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై బాబును విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరింది. 

అటూ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసుతో పాటు, ఇటూ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకలకు సంబంధించిన కేసులో కూడా చంద్రబాబును విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుతో పాటు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణ, మరికొందరిపై సీఐడీ అధికారులు గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా నారా లోకేష్‌ ఉన్నారు. 
 

vuukle one pixel image
click me!