ఇకపై వైసీపీ ఇంకా ఇబ్బంది పెడుతుంది.. జాగ్రత్త : శ్రేణులకు చంద్రబాబు హెచ్చరిక

By Siva KodatiFirst Published Mar 24, 2023, 6:38 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో విజయం తెలుగుదేశం పార్టీదే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నలుగురు ఎమ్మెల్యేలు తమకు ఓటేసి స్క్రిప్ట్ తిరగరాశారని.. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పైరవీలు వుండవని ఆయన స్పష్టం చేశారు. 
 

ఇకపై వైసీపీ విషయంలో మరింత అప్రమత్తంగా వుండాలని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వచ్చే టీడీపీ ప్రభుత్వంలో పైరవీలు వుండవని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఎం జగన్‌పై వైసీపీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని.. నలుగురు ఎమ్మెల్యేలు తమకు ఓటేసి స్క్రిప్ట్ తిరగరాశారని చంద్రబాబు పేర్కొన్నారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీయే కొనుగోలు చేసిందని ఆయన చురకలంటించారు. పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగిరిందని.. తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు. అమరావతిని జగన్ భ్రష్టు పట్టించారని.. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూశారని ఆయన ఎద్దేవా చేశారు.  

అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో దిట్ట అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. ఆయన  తెలంగాణలో స్టీపెన్‌ను కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ  తెలుసునని అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ  ఎన్నికల ఫలితాలపై వంశీ  స్పందిస్తూ.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మా మాజీ బాస్ డబ్బులు ఆశచూపి కొనుగోలు చేయడంలో ఎక్స్‌పర్ట్’’ అని కామెంట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నలుగురిని కొనుగోలు చేసినట్టుగా తేలిందని.. అందుకే ఆ పార్టీ గెలిచిందని అన్నారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి అర్దరాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్రలోభ పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. 

Also REad: ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన ముసలం... వైసీపీ కి మున్ముందు మరిన్ని కష్టాలు..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చంద్రబాబు గెలిచాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రాని ఆ నలుగురు ఎమ్మెల్యేలతో చంద్రబాబు బేరం కుదుర్చుకున్నారని అన్నారు. చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడటం అలవాటని విమర్శించారు. టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది వైసీపీ అధిష్టానం గుర్తించిందని అన్నారు. 

మొన్న తెలంగాణలో అధికారంలోకి వస్తామని టీడీపీ చెప్పిందని.. ఇప్పుడు ఏపీలో 175 స్థానాల్లో గెలుస్తామని చెబుతోందని విమర్శలు గుప్పించారు. టీడీపీ జరిగేవి చెప్పాలని అన్నారు.  బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవని అన్నారు. సినిమాలో డూపులు అమర్చినట్టుగా వారి మాటలు  కూడా డూపులేనని విమర్శించారు. సినిమాకు, రాజకీయానికి చాలా తేడా ఉందని అన్నారు. సార్వత్రిక, సాధారణ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది అందరూ చూశారని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ వైసీపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు.

click me!