ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం: నిరవధికంగా వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ

By narsimha lode  |  First Published Mar 24, 2023, 5:45 PM IST

ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ  శుక్రవారం నాడు  ఆమోదం తెలిపింది.ఈ బిల్లును  ఆమోదించిన తర్వాత  అసెంబ్లీ నిరవధికంగా  వాయిదా పడింది. 


అమరావతి: ద్రవ్య వినిమయ బిల్లుకు  ఏపీ అసెంబ్లీ  శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది.   ద్రవ్య వినిమయ బిల్లుకు  ఆమోదం తెలిపిన తర్వాత  ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది.  

ద్రవ్య వినిమయ బిల్లును  ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రవేశ పెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై  ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రసంగించారు.  తమ ప్రభుత్వం  ప్రవేశ పెట్టిన బడ్జెట్  అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా  ఏపీ సీఎం జగన్  చెప్పారు.  రైతన్నల పక్షపాత బడ్జెట్  ఉందన్నారు. గత నాలుగేళ్లుగా  రాష్ట్ర ప్రభుత్వం  సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి  దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తుందని సీఎం జగన్ వివరించారు.  ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నామన్నారు. బడ్జెట్ కు సంబంధించి ప్రత్యేకమైన క్యాలెండర్ ను సీఎం విడుదల  చేశారు. ఏ నెలలో  ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామో  క్యాలెండ్ ద్వారా తెలుపుతున్నామన్నారు సీఎం జగన్.  ఏప్రిల్ లో  జగనన్న వసతి దీవెన  కార్యక్రమాన్ని అందిస్తామన్నారు. వైఎస్ఆర్ ఆసరా  పథకం  రేపటి నుండి ప్రారంభం కానుందన్నారు. ఏప్రిల్  5 వరకు  వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. 

Latest Videos

undefined

also read:అమరావతి అవినీతిలో చంద్రబాబుకు వాటా: ఏపీ అసెంబ్లీలో జగన్

మే మాసంలో  వైఎస్ఆర్ భరోసా, రైతు కిసాన్ , వైఎస్ఆర్ విద్యాదీవెన,  కళ్యాణలక్ష్మి తొలి విడత నిధులు విడుదల చేస్తామన్నారు. జూన్ లో జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. .జూలైలో  జగనన్న విదేశీ విద్యాదీవెన  ఆగష్టులో  కాపు నేస్తం,  జగనన్న విద్యాదీవెన  రెండో విడత  నిధులను విడుదల చేయనున్నట్టుగా సీఎం వివరించారు.  సెప్టెంబర్ లో  వైఎస్ఆర్ చేయూత  , అక్టోబర్ లో  వైఎస్ఆర్ రైతు భరోసాకు నిధులు  అందిస్తామని సీఎం వివరించారు.  అనంతరం  ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం  అసెంబ్లీ   నిరవధికంగా  వాయిదా పడింది .

click me!