దీపావళి పండగ రోజున ఎన్నికల ప్రక్రియ పెట్టడం దారుణమని తెలుగు దేశం పార్టీ (Telugu Deasm party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandarababu Naidu) అన్నారు. ఇతర మతాల పండుగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ పెట్టేవారా అని చంద్రబాబు ఎస్‌ఈసీని ప్రశ్నించారు.
దీపావళి పండగ రోజున ఎన్నికల ప్రక్రియ పెట్టడం దారుణమని తెలుగు దేశం పార్టీ (Telugu Deasm party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandarababu Naidu) అన్నారు. ఇతర మతాల పండుగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ పెట్టేవారా అని చంద్రబాబు ఎస్‌ఈసీని ప్రశ్నించారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు.. గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చెడును తొలగించుకుని మంచిని పెంచుకునే పండగ దీపావళి అని అన్నారు. దీపావళి పండగ రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపావళి రోజున ఎన్నికల నామినేషన్లు పెట్టడం హిందువుల మనోబావాలను దెబ్బతీయటమే అన్న చంద్రబాబు.. పైశాచికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీని బట్టి సీఎం ఉద్దేశం అర్తం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. దీపావళి రోజున నామినేషన్ల ప్రక్రియ పెట్టాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
Also read: అమరావతి, పోలవరం లేని రాష్ట్రాన్ని ఊహించలేం.. రైతుల పాదయాత్రకు చంద్రబాబు మద్దతు
రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఈసారైనా పకడ్బందీగా ఎన్నికలు జరపాలని కొందరు కోర్టును ఆశ్రయించారని అన్నారు. నామినేషన్ల సమయంలో వైసీపీ బెదిరింపులకు దిగుతుందన్నారు. ఎస్‌ఈసీపైనా ఎవరైనా ఒత్తిడి తెస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల్లో అక్రమాలకు కొందరు అధికారులను నియమించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన కొన్ని ఫొటోలను ప్రదర్శించారు. పెద్దిరెడ్డి అనుచరుడిని కుప్పంలో నియమించారని అన్నారు.
Also read: ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..
నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో దాఖలు చేసే వెసులుబాటు కల్పించాలని కోరినట్టుగా తెలిపారు. జాగ్రత్తలపై ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేసిందన్నారు. 16 పాయింట్లతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ లిఖిత పూర్వకంగా వినతిపత్రం ఇచ్చిందని చెప్పారు. స్కాన్ చేసిన ప్రతిని ఆర్వోకు ఈమెయిల్ చేసే వెసులుబాటు కల్పించాలని కోరినట్టుగా చెప్పారు. చిన్నతప్పు చేసినా నామినేషన్లు చెల్లకుండా చేసే ప్రమాదం ఉందన్నారు. ఆర్వోలు డ్రామాలు ఆడితే సహించబోమని చెప్పారు.
నామినేషన్లు దాఖలు చేసే జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. న్యాయవాదుల సలహా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నామినేషన్ ప్రతులను సోషల్ మీడియాలో పెట్టాలని, మీడియాకు కూడా ఇవ్వాలని సూచించారు. బెదిరింపు కాల్స్ వస్తే రికార్డు చేయాలని అన్నారు. వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఎన్నికలు పకడ్బందీగా జరిగితే వైసీపీ గెలవలేదని విమర్శించారు. ఎన్నికల్లో డబ్బులు కూడా కొంతమేర పనిచేస్తాయని అనేక సంఘటనలు రుజువు చేశాయని అన్నారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. తన ప్రెస్ మీట్ సందర్భంగా చంద్రబాబు కొన్ని వీడియో, ఆడియో క్లిప్స్‌ను ఈ సందర్భంగా ప్రదర్వించారు. వైసీపీ బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు.