రామోజీరావుపై కేసులు.. జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం, చెడుకు ఓటమేనంటూ చురకలు

Siva Kodati |  
Published : Aug 21, 2023, 02:27 PM IST
రామోజీరావుపై కేసులు.. జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం, చెడుకు ఓటమేనంటూ చురకలు

సారాంశం

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై ఏపీ ప్రభుత్వ దాడులు, అక్రమ కేసులపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచిపై చెడు ఎప్పుడూ ఓడిపోతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. 

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై ఏపీ ప్రభుత్వ దాడులు, అక్రమ కేసులపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ మీడియాను నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని.. నియంతలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మోసాలను, పనులను బయటపెడుతున్న ఈనాడు లాంటి సంస్థలను వేధించి, బెదిరిస్తున్నారని టీడీపీ చీఫ్ ఆరోపించారు. పరిపాలనలో వైఫల్యం, ప్రజలలో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతతో జగన్ నైరాశ్యంలో కూరుకుపోయారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

దాదాపు 6 దశాబ్ధాలుగా తెలుగు ప్రజలకు సేవ చేస్తున్న మార్గదర్శి వంటి సంస్థలను జగన్ లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్ష నేత ఆరోపించారు. జర్నలిజం, సాహిత్యం, విద్యా రంగాల్లో చేసిన సేవకు గాను రామోజీరావును కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించిందని చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిపై వైసీపీ చేసిన దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచిపై చెడు ఎప్పుడూ ఓడిపోతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే