ఓట్ల తొలగింపుపై పయ్యావుల ఫిర్యాదు: అనంత జడ్పీ సీఈఓలపై సస్పెన్షన్

By narsimha lode  |  First Published Aug 21, 2023, 1:29 PM IST

ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి  అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓలపై  వేటు పడింది.  ఉరవకొండ ఎమ్మెల్యే  పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మేరకు  ఈ నిర్ణయం తీసుకున్నారు.



అనంతపురం: ఓట్ల తొలగింపు అంశంలో  అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓ  భాస్కర్ రెడ్డిపై నిన్న సస్పెన్షన్ వేటు పడింది.ఉరవకొండలో  ఓట్ల తొలగింపు అంశంపై  సీఈసీ ఆదేశాల మేరకు  భాస్కర్ రెడ్డిపై వేటు పడింది. మరో వైపు  భాస్కర్ రెడ్డి కంటే ముందుగా  జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేసిన శోభారాణిపై కూడ   ఇవాళ  వేటేసింది ప్రభుత్వం.  ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.  ఉరవకొండలో  అక్రమంగా ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి  టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఫిర్యాదు మేరకు  ఈసీ అధికారులు  విచారణ జరిపారు.ఈ విచారణ తర్వాత అధికారులపై  చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దరిమిలా అధికారులు శోభారాణిపై  సస్పెన్షన్ వేటేశారు.

2020, 2021లో  టీడీపీ మద్దతుదారులకు చెందిన ఆరువేల ఓట్లను  నోటీసులు ఇవ్వకుండానే  పయ్యావుల కేశవ్  ఈసీ  అధికారులకు  ఫిర్యాదు చేశారు. ఒకే ధరఖాస్తుపై  పెద్ద మొత్తంలో  ఓట్లను జాబితాను  తొలగించారన్నారు.

Latest Videos

undefined

గత 2022 అక్టోబర్ 27న పయ్యావుల కేశవ్  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై  గత ఏడాది  నవంబర్ లో విచారణ నిర్వహించి  నివేదిక ఇవ్వాలని  ఈసీ స్థానిక అధికారులను ఆదేశించింది. ఈసీకి  చెందిన కీలక అధికారులు  కూడ అనంతపురం చేరుకొని  విచారణ  నిర్వహించారు.ఈ సమయంలో  పయ్యావుల కేశవ్ తన వద్ద ఉన్న ఆధారాలను  ఈసీ అధికారులకు సమర్పించారు. స్థానిక అధికారుల రిపోర్టుపై  ఈసీని  కేశవ్  ఆశ్రయించారు.

 ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం  ఈ ఏడాది జూన్ లో  బాధ్యులైన అధికారులపై  చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. దరిమిలా  అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓ భాస్కర్ రెడ్డిపై  సస్పెన్షన్ వేటు పడింది.

click me!