రమేశ్‌ను మేం నియమించలేదు.. నేను అడిగింది వేరొకరిని: జగన్ వ్యాఖ్యలపై బాబు కౌంటర్

By Siva KodatiFirst Published Mar 15, 2020, 7:56 PM IST
Highlights

ఎన్నికల కమీషనర్‌ను తాను నియమించలేదని సీఆర్ బిశ్వాని ఏపీకి ఎన్నికల కమీషనర్‌గా నియమించాల్సిందిగా తాను కేంద్రానికి సిఫారసు చేశానన్నారు చంద్రబాబు నాయుడు.

ఎన్నికల కమీషనర్‌ను తాను నియమించలేదని సీఆర్ బిశ్వాని ఏపీకి ఎన్నికల కమీషనర్‌గా నియమించాల్సిందిగా తాను కేంద్రానికి సిఫారసు చేశానన్నారు చంద్రబాబు నాయుడు. అయితే నాటి గవర్నర్ నరసింహన్ స్వయంగా కేంద్రానికి రమేశ్ కుమార్‌ను సిఫారసు చేశారని ప్రతిపక్షనేత గుర్తుచేశారు.

కొద్దిరోజుల క్రితమే ఎన్నికల కమీషన్‌పై రాష్ట్ర హైకోర్టు మండిపడిందని బాబు గుర్తుచేశారు. రాష్ట్రంలోని వివిధ కార్యాలయాలకు వైసీపీ రంగులతో పాటు పలు చోట్ల వైసీపీ వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఎన్నికల వాయిదాపై జగన్, వైసీపీ నేతల ఆరోపణలు: స్పందించిన ఈసీ రమేశ్ కుమార్

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నికలు సజావుగా నిర్వహించానని, ఎక్కడ టీడీపీ వాణిజ్య ప్రకటనలు కనిపించలేదని చంద్రబాబు గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ నేతలకు భద్రత తొలగించారని, వివిధ కాంట్రాక్టుల్లో రావాల్సిన బిల్లులు నిలిపివేయడంతో పాటు భౌతికదాడులకు దిగుతున్నారని ప్రతిపక్షనేత మండిపడ్డారు.

అధికారులు ప్రజలకు సేవలకు గానీ జగన్మోహన్ రెడ్డికి కాదన్నారు. ఎన్నికలను రీ నోటిఫై చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేన తదితర పార్టీలు కోరుతున్నాయని, పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ చీఫ్ కోరారు.

Also Read:ఈసీ రమేశ్ కుమార్‌ను వదిలేది లేదు.. ఎంత దూరమైనా వెళ్తాం: జగన్ హెచ్చరిక

ప్రెస్‌మీట్ పెట్టి ఎస్ఈసీని నిందించారని, ఇప్పుడు ఆయనకు భద్రత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వార్తాపత్రికలకు కులాలు అంటగట్టి రాజకీయాలు చేస్తున్నారని, నిజాయితీగా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ డిమాండ్ అని ప్రతిపక్షనేత చెప్పారు.

ఫైనాన్స్ కమీషన్ నిధులు ఆగిపోకుండా కేంద్రానికి తాము లేఖ రాస్తామని, ఎన్నికల వాయిదాకు, నిధుల విడుదలకు లింక్ పెట్టొద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 151 సీట్లు వస్తే రాజ్యాంగానికి అతీతంగా పనిచేయాలని లేదని, రాష్ట్రపతి సహా అన్ని రాజ్యాంగ వ్యవస్థలను కలుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

click me!