
గుంటూరు జిల్లా (guntur district) అచ్చంపేట మండలం మాదిపాడులో (madipadu veda patasala) శుక్రవారం కృష్ణానదిలో (krishna river) ఈతకు వెళ్లిన ఆరుగురు వేద విద్యార్థులు మృతి చెందడంపై తెలుగుదేశం పార్టీ (telugu desam party) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి వేద విద్య నేర్చుకుంటూ ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు ప్రమాదవశాత్తు జలసమాధి కావడం తనను కలిచివేస్తోందని చంద్రబాబు అన్నారు.
గతంలోనూ ఇదే వేద పాఠశాల సమీపంలో ఇలాంటి ఘటనలు జరిగాయని .. విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యం, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని.. నదిలో స్నానానికి వెళ్లే విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకునేలా పోలీసులు మార్గనిర్దేశం చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు.
కాగా.. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అచ్చంపేట శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయుడు, ఐదుగురు విద్యార్థులను తీసుకుని సమీపంలోని కృష్ణానదిలో సంధ్యావందనానికి వెళ్లాడు. అయితే నదిలో నీటి ప్రవాహఉదృతి ఎక్కువగా వుండటంతో వీరంతా కొట్టుకుపోయారు. ఇది గమనించిన కొందరు వారిని కాపాడే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో విద్యార్థుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మృతులను హర్షిత్ శుక్లా, శుభమ్ త్రివేది, అన్షుమన్ శుక్లా, శివ శర్మ, నితేష్ కుమార్ దిక్షిత్‌గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.