స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో రూ.242 కోట్లు స్కామ్ జరిగినట్లు దర్యాప్తులో తేలింది. అక్రమాలపై తప్పు ఒప్పుకున్నారు పూణేకు చెందిన షెల్ కంపెనీ ప్రతినిధులు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో రూ.242 కోట్లు స్కామ్ జరిగినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో అప్పటి ఛైర్మన్ గంటా సుబ్బారావుతో పాటు మరో ముగ్గురు షెల్ కంపెనీల ప్రతినిధులను అదుపులోకి తీసుకున్న సీఐడీ వీరిని వేర్వేరు ప్రాంతాల్లో ప్రశ్నిస్తోంది. మరోవైపు అక్రమాలపై తప్పు ఒప్పుకున్నారు పూణేకు చెందిన షెల్ కంపెనీ ప్రతినిధులు.
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (ap skill development) 26 మందిపై శుక్రవారం ఎఫ్ఐఆర్ (fir) నమోదు చేశారు సీఐడీ అధికారులు (ap cid) . మాజీ స్పెషల్ సెక్రటరీ గంటా సుబ్బారావు (ganta subbarao) , మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ (lakshmi narayana), ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట కృష్ణపైనా (nimmagadda venkata krishna) కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ సిస్టం, పాత్రిక్ సర్వీస్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్, ఇన్ వెబ్ సర్వీస్‌లపైనా కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఢిల్లీ, పుణేలకు చెందిన పలువురు కంపెనీ డైరెక్టర్లపైనా కేసు నమోదు చేశారు.
undefined
Also Read:ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్: లక్ష్మీనారాయణ ఇంట్లో ముగిసిన సీఐడీ సోదాలు.. 26 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ గుర్తించింది. ఫోరెన్సిక్ ఆడిట్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఏపీ సీఐడీ. కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఎఫ్ఐఆర్‌లో వెల్లడించారు. నిరుద్యోగులకు శిక్షణ పేరుతో నిధులు మళ్లించినట్లుగా గుర్తించారు. ప్రైవేట్ కంపెనీలతో కలిసి నిధులు మళ్లించినట్లు సీఐడీ గుర్తించింది. అలాగే మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు పూర్తి చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది సీఐడీ. చైర్మన్‌గా వున్న గంటా సుబ్బారావుకు కూడా నోటీసులు ఇచ్చింది.
స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.242 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ ఇచ్చినట్లు పేర్కొంది డిజైన్ టెక్. పుణే జీఎస్టీ సోదాల్లో సాఫ్ట్‌వేర్ మోసం వెలుగు చూసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఇవ్వలేదని నిర్ధారించారు. 4 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించినట్లు గుర్తించారు