టీడీపీలో ప్రక్షాళన మొదలెట్టిన చంద్రబాబు.. ఇద్దరు నేతల సస్పెన్షన్

Siva Kodati |  
Published : Dec 11, 2021, 09:33 PM ISTUpdated : Dec 11, 2021, 09:34 PM IST
టీడీపీలో ప్రక్షాళన మొదలెట్టిన చంద్రబాబు.. ఇద్దరు నేతల సస్పెన్షన్

సారాంశం

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (nellore corporation election ) ఓటమిపై సమీక్ష చేపట్టిన ఆయన.. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి కారకులపై కన్నెర్ర చేశారు. 

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (nellore corporation election ) ఓటమిపై సమీక్ష చేపట్టిన ఆయన.. ఈ సందర్భంగా పార్టీ ఓటమికి కారకులపై కన్నెర్ర చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలను సస్పెండ్ చేశారు. అంతేకాదు నెల్లూరు నగర పార్టీ డివిజన్ కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చాక మరికొందరిపై చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. 

త్వరలోనే నెల్లూరు నగర టీడీపీకి కొత్త కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. టీడీపీలో ఇకపై కుమ్మక్కు రాజకీయాలు సాగవని ... కోవర్టులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు అవసరంలేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత నాయకులపై లేదా? అని పార్టీ సమావేశంలో ప్రశ్నించారు. పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలో తనకు తెలుసునని, టీడీపీలోకి యువరక్తాన్ని తీసుకువస్తానని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేసేవారికే ఇకపై పార్టీ పదవులు లభిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. 

ALso Read:మాట తప్పారు, మడమ తిప్పారు: ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై జగన్ పై బాబు ఫైర్

అంతకుముందు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీల విషయంలో జగన్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో  ఎన్నికల ముందు ఇచ్చిన మాటను  అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కారన్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ ఎందుకు పోరాటం చేయడం లేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. Special stutus పై ycp కి చిత్తశుద్ది ఉంటే ఆ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే తమ పార్టీ ఎంపీలంతా కూడా రాజీనామాలు చేస్తారని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ప్రత్యేక హోదాపై Ys Jagan మాట తప్పారని చంద్రబాబు విమర్శించారు.ప్రత్యేక హోదా ముగిసన అధ్యాయమని మరోసారి పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటించినా కూడా వైసీపీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని... ప్రత్యేక హోదా కోసం కేంద్రం నుండి వైదొలిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ప్రత్యేక హోదాతో పాటుVisakha steel facotory, , రైల్వే జోన్ అంశాలపై  ప్రజల్లో ఉన్న అసంతృప్తి నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
Vijayawada Police Press Conference: 2025 నేర నియంత్రణపై పోలీస్ కమీషనర్ ప్రెస్ మీట్| Asianet Telugu