
పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఏపీ సీఎం జగన్‌పై చేసిన విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగా బదులిస్తున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ప్రజలు ఇవ్వాలి తప్పించి.. ముష్టి అడిగితే వచ్చేది కాదన్నారు. ఎవరు అడ్డుకున్నా ఈ సారి అసెంబ్లీలో అడుగుపెడతానని పవన్ అంటున్నారని.. ఆయన ఎమ్మెల్యేగా గెలిచేందుకు తిరుగుతున్నారా లేక తన ఎమ్మెల్యేల్ని గెలిపించడానికా అంటూ మంత్రి సెటైర్లు వేశారు. ముందు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై పవన్ నిర్ణయించుకోవాలన్నారు.
ఇక చెప్పుల విషయంగా మాజీ మంత్రి పేర్నినానిపై పవన్ సెటైర్లు వేయడంపైనా మంత్రి స్పందించారు. చెప్పులు మరిచిపోతే తెచ్చుకోవచ్చని.. పార్టీ గుర్తు పోతే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ గుర్తు పోయిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలని అప్పలరాజు చురకలంటించారు. పార్టీ గుర్తు ప్రస్తుతం ఎక్కడుందో, ఎన్నికల సంఘం ఎవరికి కేటాయించిందో తెలుసుకోవాలన్నారు. మరోవైపు .. ఏపీలో పొత్తుల విషయంపైనా అప్పలరాజు తీవ్రవ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీలు తెర ముందు నాటకాలు వేస్తూ .. తెర వెనుక అంతా కలిసే సంసారం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. మరి పవన్ ఎన్ని చోట్ల పోటీ చేస్తాడని అప్పలరాజు ప్రశ్నించారు.
ALso Read: చెప్పులు కాదు... ముందు ‘గ్లాస్’ పోయింది చూస్కో : పవన్ కల్యాణ్‌కు పేర్ని నాని కౌంటర్
అంతకుముందు చెప్పుల వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. పవన్‌కు చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడని.. ముందు నీ గాజు గ్లాస్ సింబల్ పోయింది అది చూసుకోవాలని సెటైర్లు వేశారు. గతేడాది అక్టోబర్ 18వ తేదీన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే ఎవరో తన చెప్పు కొట్టేశాడని నాని అన్నారు. ఆ పక్కనే పవన్ కల్యాణ్ ఆఫీస్ వుందని ఆయనను అనుమానించలేం కదా అంటూ బందర్ ఎమ్మెల్యే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక చెప్పు పోయి 9 నెలలు అవుతోందని.. ఒక చెప్పుతో ఏం చేసుకుంటాడోనంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు. చెప్పులు పోయిన మూడ్రోజులకే పవన్ కంగారు పడుతున్నారని.. మరి నా చెప్పు పోయి 9 నెలలు అవుతోందన్నారు.