వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి వున్నప్పుడు జరిగిన నాసిరకం పనుల వల్లే పులిచింతల గేలు కొట్టుకుపోయిందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, కుంభకోణాలు చేసే స్కీమ్‌లకు ఆ నిధులు మళ్లిస్తున్నారన్నారు.
పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ గేటు కొట్టుకుపోవడంపై టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. నాడు వైఎస్ హయాంలో జరిగిన నాసిరకం పనుల వల్లే గేటు కొట్టుకుపోయిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, కుంభకోణాలు చేసే స్కీమ్‌లకు ఆ నిధులు మళ్లిస్తున్నారని టీడీపీ చీఫ్ ఆరోపించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని.. కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు చెల్లించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. నిబంధనల పేరుతో భారీగా రేషన్ కార్డులు, పింఛన్లలో కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులు ఆర్ అండ్ బి విభాగానికి అప్పగించడాన్ని ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు.
Also Read:పులిచింతలలో ప్రారంభమైన స్టాప్‌లాక్ ఏర్పాటు పనులు.. ట్రయల్ విజయవంతం
మరోవైపు పులిచింతల ప్రాజెక్ట్‌లో స్టాప్ లాక్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. స్టాప్ లాక్‌లో ఒక భాగం ట్రయల్ విజయవంతమైంది. ఇదే క్రమంలో గేటు ఊడిపోయిన ప్రాంతంలో ఇనుప చట్రాలను అమర్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. స్టాప్ లాక్స్ ద్వారా వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయనున్నారు.