పేకాట క్లబ్బుపై దాడి: పోలీసులపై తిరగబడిన నిర్వాహకులు... ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Aug 27, 2020, 07:51 PM IST
పేకాట క్లబ్బుపై దాడి: పోలీసులపై తిరగబడిన నిర్వాహకులు... ఉద్రిక్తత

సారాంశం

కర్నూలు జిల్లాలో పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులోని పేకాట క్లబ్బులపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించారు.

కర్నూలు జిల్లాలో పేకాట క్లబ్బులపై పోలీసులు దాడులు నిర్వహించారు. చిప్పగిరి మండలం గుమ్మనూరులోని పేకాట క్లబ్బులపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇవి ఉద్రిక్తతకు దారి తీశాయి.

స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా రూ.2 కోట్లకు పైగా నగదు, 40 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు పేకాట రాయుళ్లను వదిలిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు క్లబ్ నిర్వాహకులు. అంతటితో ఆగకుండా పోలీసులపైకే తిరగబడ్డారు. గుమ్మనూరుకు రావడానికి ఎంత ధైర్యమంటూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే సమయంలో పోలీసులను చూసి మరికొందరు పారిపోయారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!