వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు కారులో డెడ్‌బాడీ : నిజనిర్థారణ కమిటీని నియమించిన చంద్రబాబు

Siva Kodati |  
Published : May 20, 2022, 09:33 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు కారులో డెడ్‌బాడీ : నిజనిర్థారణ కమిటీని నియమించిన చంద్రబాబు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ  అనంతబాబు కారులో డ్రైవర్ మృతదేహం ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ తరపున నిజనిర్థారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు రేపు కాకినాడలో పర్యటించనున్నారు. 

ఎమ్మెల్సీ అనంత భాస్కర్ డ్రైవర్ మృతిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రేపు కాకినాడలో పర్యటించనుంది టీడీపీ నిజనిర్ధారణ కమిటీ. పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు, ఎంఎస్ రాజు, పీతల సుజాత, పిల్లి మాణిక్యాలరావులను కమిటీ సభ్యులుగా చంద్రబాబు నియమించారు. 

YCP ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అలియాస్ బాబు అలియాస్ అనంతబాబు వద్ద గతంలో పనిచేసిన డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పదస్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. Subramanyam  నివాసం ఉండే అపార్ట్‌మెంట్ వద్దకు సుబ్రమణ్యం మృతదేహం ఉన్న కారును తీసుకొచ్చిన ఎమ్మెల్సీ  Ananta Uday Babu కారును అక్కడే వదిలి వెళ్లాడు.  గురువారం నాడు రాత్రి యాక్సిడెంట్ అయిందని సుబ్రమణ్యం సోదరుడికి  YCP MLC  ఉదయబాబు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎమ్మెల్సీ ఉదయబాబు డెడ్ బాడీ ఉన్న మృతదేహన్ని కారులో తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ డెడ్ బాడీ ఉన్న కారును సుబ్రమణ్యం నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వద్దే వదిలి వెళ్లాడు ఎమ్మెల్సీ ఉదయ్ బాబు. 

సుబ్రమణ్యం చనిపోవడానికి ఎమ్మెల్సీ ఉదయబాబే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీని శుక్రవారం నాడు ఉదయం పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా సుబ్రమణ్యం కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ ఉదయ్ బాబుకు సుబ్రమణ్యం రూ. 20 వేలు బకాయి ఉన్నాడు. ఈ విషయమై సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ ఉదయ్ బాబు అడిగేవాడని చెబుతున్నారు. కొంత సమయం ఇస్తే ఈ డబ్బులు తిరిగి ఇస్తామని సుబ్రమణ్యం ఎమ్మెల్సీకి చెప్పారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు.

ఉదయ్ బాబును ఎమ్మెల్సీ కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు  కూడా మృతుడి కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. సుబ్రమణ్యం చనిపోవడానికి  డబ్బుల వ్యవహరమే కారణమా ఇంకా ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu