అనంతలో జూ.ఎన్టీఆర్ అభిమానుల హంగామా: చంద్రబాబు మీటింగ్ కి సమీపంలోనే తారక్ బర్త్ డే వేడుకలు

By narsimha lode  |  First Published May 20, 2022, 5:30 PM IST


అనంతపురం జిల్లా సోమందేపల్లిలో  జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి సమీపంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి హంగామా చేశారు. కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. 
 


అనంతపురం: Anantapur జిల్లాలో Junior NTR అభిమానులు హంగామా చేశారు. Chandrababu Naidu సభా వేదికకు సమీపంలోనే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. కాబోయే సీఎం అంటూ నినాదాలు చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలను అనంతపురం జిల్లాలో అభిమానులు ఘనంగా నిర్వహించారు.  ఇవాళ అనంతపురం జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సాగుతున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. 

Latest Videos

also read:జూ. ఎన్టీఆర్ వస్తున్నారంటేనే....: చంద్రబాబుపై అంబటి సంచలన వ్యాఖ్యలు

2021 జూలై 14న చంద్రబాబు టూర్‌లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో తెలుగు తమ్ముళ్లు హల్‌చల్ చేశారు. విజయవాడలో జరిగిన చంద్రబాబు టూర్ లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హల్ చల్ చేశారు. 

గతంలో Kuppam టూర్ లో కూడ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి తీసుకురావాలని చంద్రబాబును ఆ పార్టీ కార్యకర్తలు కోరారు. ఆ తర్వాత కూడ జూనియర్ ఎన్టీఆర్  గురించి కొందరు పార్టీ నేతలు కూడ మాట్లాడిన విషయం తెలిసిందే.

వారం రోజుల క్రితం కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. కుప్పం నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత శివను చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో పార్టీలో చీలికలు తీసుకురావొద్దని కూడా వార్నింగ్ ఇచ్చారని సమాచారం.

ఉమ్మడి  ఏపీ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  జూనియర్ ఎన్టీఆర్ TDP  తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని హైద్రాబాద్ వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఆసుపత్రిలో ఉండి కూడ టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. 

click me!