రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్న చంద్రబాబు బృందం.. సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారు

By team teluguFirst Published Oct 23, 2021, 2:49 PM IST
Highlights

టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) సోమ, మంగళ వారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం టీడీపీ (TDP) బృందం రాష్ట్రపతి కలవనున్నారు. ఈ  క్రమంలోనే  రాష్ట్రపతి వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు.

టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) సోమ, మంగళ వారాల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రం మాదక ద్రవ్యాలకు అడ్డగా మారిందని, అధికార వైసీపీ ప్రతిపక్ష  పార్టీల నాయకులపై కక్ష  సాధింపు చర్యలు దిగుతుందని ఆరోపిస్తున్న టీడీపీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్  కోవింద్‌కు ఫిర్యాదు చేయనుంది. అంతేకాకుండా టీడీపీ కేంద్ర కార్యాలయం, నేతలపై దాడులను కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారు. అలాగే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. ఈ  క్రమంలోనే  రాష్ట్రపతి వద్ద ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించేందుకు చంద్రబాబు నాయుడు శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేశినేని  నాని, పయ్యావుల కేశవ్, వర్ల  రామయ్యా, నిమ్మల రామనాయుడు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మొత్తం 18 మందితో కూడిన టీడీపీ  బృందం ఢిల్లీ వెళ్లనుంది.  

సోమ, మంగళ వారాల్లో చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ బృందం ఢిల్లీలో పర్యటించనుంది. టీడీపీ బృందం కలిసేందకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమయమిచ్చినట్టుగా రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. ఐదుగురు నేతలు తనను కలిసేందుకు రాష్ట్రపతి  అనుమతిచ్చారు. 

Also read: జగన్ రెడ్డిది స్పెషల్ క్యారెక్టర్...ఆయనకు విలన్ అనే పేరు చిన్నది.. చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ (telugu desam party) కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా 36 గంటల పాటు ఆ పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు  నాయుడు దీక్ష చేశారు. ఈ దీక్ష ముగింపు సందర్బంగా చంద్రబాబు నాయుడు  మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డ్రగ్స్ కథ తేల్చేవరకు టీడీపీ  రాజీలేని  పోరాటం  చేస్తుందన్నారు. పోలీసుల అండతోనే  రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా సాగుతుందని ఆరోపించారు. రెండున్నరేళ్లుగా  టీడీపీ శ్రేణుల్ని ఆర్థికంగా, మానసికంగా  వేధించినా భరించామని.. డ్రగ్స్‌తో యువత భవిష్యత్ పాడు చేస్తుంటే  చూస్తు ఊరుకోమని అన్నారు. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రతిపక్షాలను, ఇబ్బందులకు గురిచేస్తూ ఉగ్రవాద పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో చట్టబద్దమైన  పాలన పునరుద్దరించడానిక రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలకు, ప్రతిపక్ష పార్టీ నాయకులకు వెంటనే సెంట్రల్ పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు.

click me!